ఆ రికార్డ్స్ మ‌హ‌ర్షి బ‌ద్ద‌లు కొడుతుందా..?

మరికొన్ని గంటల్లో మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. తెలుగులో పెద్ద సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడంతో ఈ [more]

Update: 2019-05-08 07:47 GMT

మరికొన్ని గంటల్లో మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. తెలుగులో పెద్ద సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడంతో ఈ సినిమాపై బాగా క్రేజ్ ఉంది. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందంటే మహేష్ ఫ్యాన్స్ కి సైతం ఇంకా టికెట్స్ దొరకలేదట. గత రెండు మూడు రోజుల నుండి ఇదే హడావిడి కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా హడావిడే కనపడడంతో సినిమాకు హిట్ టాక్ వస్తే నాన్ బాహబలి రికార్డ్స్ అన్నీ తుడుచుకుపెట్టి పోవడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులు ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు.

సినిమాపై మంచి అంచ‌నాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ‘మహర్షి.. మహర్షి’ అంటూ సినిమాని పాజిటివ్ మూడ్ లోకి తీసుకెళ్తున్నారు. మరి టాక్ పరిస్థితి ఏంటో చూడాలి. రెండేళ్లు మహేష్ కోసం వెయిట్ చేసి వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో మహేష్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ కి ఫ్రెండ్ నటించాడు. మహేష్ – నరేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు.

Tags:    

Similar News