మహేష్ కి ఆమె కాదు.. మహర్షి బ్యూటీ?

అనిల్ రావిపూడి ఎఫ్ 2 హిట్ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎఫ్ 2 తో తనకి కలిసొచ్చిన తమన్నా ని సరిలేరు [more]

Update: 2019-09-11 10:12 GMT

అనిల్ రావిపూడి ఎఫ్ 2 హిట్ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎఫ్ 2 తో తనకి కలిసొచ్చిన తమన్నా ని సరిలేరు నీకెవ్వరూ సినిమా కోసం ఓ స్పెషల్ ఇంట్రో సాంగ్ కోసం తీసుకోబోతున్నాడని… మాములుగా ప్రచారం జరగలేదు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్నా స్పెషల్ ఇంట్రో సాంగ్ అన్నారు. కానీ తాజాగా మహేష్ తో ఆగడు లో నటించిన తమన్నా సరిలేరు నీకెవ్వరు కోసం ఇంట్రో సాంగ్ చెయ్యడం లేదని… కేవలం ఆ న్యూస్ ఫేక్ అని.. ఆ ప్లేస్ లోకి మహేష్ మహర్షి బ్యూటీ పూజ హెగ్డే వచ్చిందంటున్నారు.

పూజ కాదంటుందా….?

ప్రస్తుతం ప్రభాస్ జాన్, వాల్మీకి, అలా వైకుంఠపురములో సినిమాల్తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఇంట్రో సాంగ్ కి ఆడిపాడనుందట. ఇప్పటికే అనిల్ రావిపూడి అండ్ టీం పూజ తో చర్చలు జరుపుతున్నారని.. రంగస్థలంలో పూజ హెగ్డే చేసిన జిగేల్ రాణీ కి వచ్చిన పేరుకు ఈ సినిమాలో చేసిన స్పెషల్ ఇంట్రో కి వస్తుందని పూజ కి చెప్పి ఒప్పించే ప్రయత్నాల్లో సరిలేరు నీకెవ్వరూ టీం ఉందట. మరి మహర్షి తో తనకి అవకాశం ఇచ్చిన మహేష్ అడిగితే పూజ కాదంటుందా.. వెంటనే ఒప్పేసుకోదు..!

 

Tags:    

Similar News