మహానాయకుడు లో ఆ సీన్స్ అవసరమా..?

ఎన్టీఆర్ మహానాయకుడు నిన్న రిలీజ్ అయ్యి ముందు అనుకున్నట్టే డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఓపెనింగ్స్ మరి దారుణంగా వచ్చాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 1.66 [more]

Update: 2019-02-23 06:58 GMT

ఎన్టీఆర్ మహానాయకుడు నిన్న రిలీజ్ అయ్యి ముందు అనుకున్నట్టే డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఓపెనింగ్స్ మరి దారుణంగా వచ్చాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 1.66 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది అలా పక్కన పెడితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం సినిమాలో ఎక్కువ శాతం ఎమోషన్స్ సీన్స్ ఉండడమే. ఎన్టీఆర్, తన భార్య గురించి సీన్స్ ఎమోషనల్ గా ఉండటంతో సినిమాకి పెద్ద కనెక్ట్ కాలేకపోయారు ప్రేక్షకులు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అవమానాలు, ఇబందులు చూపించాలి కానీ ఎన్టీఆర్ దంపతుల జంట ఆత్మకథలా చూపించాడు డైరెక్టర్ క్రిష్. చూపిస్తే లైట్ గా టచ్ చేసి వదిలేయాలి తప్ప సుదీర్ఘమైన సన్నివేశాలతో అంత సేపు సాగతీస్తే ఫ్యాన్స్ కైనా నచ్చే అవకాశాలు తక్కువ.

హాస్పిటల్ ప్రమోషన్..?

బసవతారకం కాన్సర్ వ్యాధి బారిన పడటంతో దాన్ని బాలకృష్ణ క్యాష్ చేసుకుని తన తల్లి పేరు మీద పెట్టిన కాన్సర్ హాస్పిటల్ ని ప్రమోట్ చేయాలనీ చూసినట్లుగా కనిపిస్తోంది. అందుకనే ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఇవన్నీ బాలయ్య చెప్పడంతో క్రిష్ చేసినట్టు అర్ధం అవుతుంది. విద్యా బాలన్ కాబట్టి ఆ మాత్రం నిలబడి చూడ బుద్ధి అయ్యింది కాని ఇంకెవరైనా యావరేజ్ నటి ఆ పాత్ర పోషించి ఉంటే అసలుకే మోసం వచ్చేది. ఈ ఓపెనింగ్స్ చూస్తే రికవరీ అవ్వడం కష్టం అని స్పష్టంగా అర్థం అవుతుంది.

Tags:    

Similar News