మహానాయకుడు సెన్సార్ రిపోర్ట్

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ [more]

Update: 2019-02-16 12:45 GMT

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘యూ’ స‌ర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్ర‌వ‌రి 22న మంచి అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుబాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను నిర్మించారు.

Tags:    

Similar News