‘మహా నాయకుడు’పై ఎలా రియాక్ట్ అవుతారో..?

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయిపోయింది. రిజల్ట్ కూడా దారుణంగా వచ్చింది. కలెక్షన్స్ కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో చూపించిన [more]

Update: 2019-02-23 07:44 GMT

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయిపోయింది. రిజల్ట్ కూడా దారుణంగా వచ్చింది. కలెక్షన్స్ కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో చూపించిన పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. అదే నాదెండ్ల భాస్కరరావు సీన్స్. ఎన్టీఆర్ తో ఉంటూ ఎన్టీఆర్ ట్రీట్మెంట్ కోసం విదేశాలు వెళ్తే ఈ లోపల ఆయన ఇందిరా గాంధీతో చేతులు కలిపి తెలుగుదేశం పతనానికి కారకుడయ్యాడని చూపించారు. మొదటి ఫేమ్ నుండి చివరి ఫేమ్ వరకు నాదెండ్ల భాస్కరరావు ను విలన్ గా చూపించారు. ఆయనను పొరపాటున కూడా పాజిటివ్ గా చూపించలేదు. మరి అటువంటి ఆయన్ని ఎన్టీఆర్ గుడ్డిగా ఎలా నమ్మి పక్కన పెట్టుకున్నారు అనేదే అర్ధం కావడం లేదు.

నాదెండ్ల ఏమంటారో..?

ఇది పక్కన పెడితే ఈ మూవీ చూసి నాదెండ్ల భాస్కర్ రావు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కథానాయకుడు చూసినప్పుడు ఆయన కొన్ని ఇంటర్వూస్ లో నన్ను అనవసరంగా చెడుగా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి చాలా విషయాలు ఆయన ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమాలో తనను పూర్తిగా నెగటివ్ గా చూపించారు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవతారనేది సస్పెన్స్ గా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

Tags:    

Similar News