‘మహానాయకుడు’పై రియాక్షన్ ఏది..?

బాలకృష్ణ – క్రిష్ లు ఎట్టకేలకు సస్పెన్సుకి తెరదించి మహానాయకుడు ప్రమోషన్స్ సైలెంట్ గా మొదలు పెట్టేసాడు. ఏటువంటి హడావిడి లేకుండా మహానాయకుడు ట్రైలర్ ని యూట్యూబ్ [more]

Update: 2019-02-18 06:47 GMT

బాలకృష్ణ – క్రిష్ లు ఎట్టకేలకు సస్పెన్సుకి తెరదించి మహానాయకుడు ప్రమోషన్స్ సైలెంట్ గా మొదలు పెట్టేసాడు. ఏటువంటి హడావిడి లేకుండా మహానాయకుడు ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. సినిమా ఈ శుక్రవారమే విడుదలకు సిద్దమవుతుండడంతో…. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెయ్యడమే కాకుండా ట్రైలర్ ని కట్ చేసి వదిలేసింది క్రిష్ బృందం. అయితే కథానాయకుడు మీద భీభత్సమైన అంచనాలు పెట్టుకుంటే.. సినిమా తుస్సుమనిపించింది. అందుకే మహానాయకుడుపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చెయ్యడం లేదు బాలయ్య అండ్ బ్యాచ్. ఇక మహానాయకుడు ట్రైలర్ విడుదలయ్యాక ఏదైనా అద్భుతం జారుతుందనుకున్న నందమూరి అభిమానులకు మహానాయకుడు ట్రైలర్ చూసాక నోట మాట రాలేదు. అంత సాదాసీదాగా ఉంది మహానాయకుడు ట్రైలర్.

ఆయనే మెయిన్ విలన్

అయితే మహానాయకుడు ట్రైలర్ లో సినిమా మొత్తం ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు మధ్యనే నడిపించినట్లుగా కనబడుతుంది. నాదెండ్ల భాస్కర్ రావునే విలన్ చేశారు బాలయ్య, క్రిష్. అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదలయ్యే నాటికే నాదెండ్ల తనని నెగెటివ్ గా చూపిస్తే ఊరుకోనని.. కోర్టుకు వెళతానని బాలయ్య బాబుకి బాగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరి కొన్నాళ్లుగా నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ బయోపిక్ విషయమై సైలెంట్ గానే ఉంటున్నాడు. తాజాగా విడుదలైన మహానాయకుడు ట్రైలర్ తో నాదెండ్ల మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ఇక నాదెండ్ల మహానాయకుడుపై విమర్శలు చేయడం కానీ.. తన క్యారెక్టర్ గురించి వ్యతిరేకత వ్యక్తం చెయ్యడం కానీ చెయ్యడం లేదు.

సినిమాపై స్పందిస్తారా..?

మహానాయకుడు ట్రైలర్ వచ్చి అప్పుడే 36 గంటల సమయం దాటుతున్నప్పటికీ.. నాదెండ్ల మాత్రం కామ్ గా ఉన్నాడు. మరి బాలయ్య, క్రిష్ లు మహానాయకుడుని నాదెళ్లకు చూపించి ఓకే చేశారా? లేదంటే మారేదైనా జరిగిందా? ఎందుకు నాదెండ్ల భాస్కర్ రావు మహానాయకుడు విషయమై స్పందించడం లేదు. మరి సినిమా విడుదలకు ముందు అంటే రేపో ఎల్లుండో మహానాయకుడుపై నిప్పులు చెరిగే ప్రోగ్రాం ఎమన్నా నాదెండ్ల పెట్టుకున్నారా.. లేదంటే మారేదన్నా లోగుట్టు దాగుందా? ఏది ఏమైనా మహానాయకుడు సినిమాలో నాదెండ్ల మెయిన్ విలన్ అనేది మహానాయకుడు ట్రైలర్ తో స్పష్టత వచ్చేసింది.

Tags:    

Similar News