దారుణంగా ‘మహానాయకుడు’ కలెక్షన్స్

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరి కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ [more]

Update: 2019-02-23 06:59 GMT

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరి కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా జనవరి 9న విడుదల కాగా.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా విడుదలైన మహానాయకుడు సినిమా మీద కూడా ఎలాంటి అంచనాలు లేవు. అసలే ప్రమోషన్స్ కూడా చెయ్యని మహానాయకుడు సినిమాకి కాస్త అంచనాలున్నా.. సినిమాకి యావరేజ్ అయినా పడేది. కానీ మహానాయకుడు కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం మహానాయకుడు సినిమా కథానాయకుడు కంటే పెద్ద డిజాస్టర్ అయ్యేలా కనబడుతుంది. అంతంత మాత్రం ప్రమోషన్స్, అంచనాలతో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మొత్తం కలెక్షన్స్ రాబట్టింది. మరి మహానాయకుడు మొదటి రోజు 2 రాష్ట్రాల కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా షేర్ (కోట్లలో)

నిజాం 0.34
సీడెడ్ 0.27
నెల్లూరు 0.06
కృష్ణ 0.15
గుంటూరు 0.21
వైజాగ్ 0.14
ఈస్ట్ గోదావరి 0.11
వెస్ట్ గోదావరి 0.08
మొత్తం ఏపీ, టీఎస్ షేర్ 1.36

Tags:    

Similar News