‘మహనాయకుడు’ ఎఫెక్ట్ ‘యాత్ర’పై పడింది..!

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ దగ్గర పడడంతో బయోపిక్స్ హడావిడి స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ మహానాయకుడు బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’ రెడీ అవుతున్నాయి. అయితే ముందు [more]

Update: 2019-01-21 09:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ దగ్గర పడడంతో బయోపిక్స్ హడావిడి స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ మహానాయకుడు బయోపిక్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’ రెడీ అవుతున్నాయి. అయితే ముందు నుండి ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న వస్తున్నాం అని అనౌన్స్ చేసి చివరికి డ్రాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ యాత్ర మీద పడినట్లు కనిపిస్తుంది. యాత్ర సినిమాకు ముఖ్యంగా ప్రమోషన్స్ మైనస్. ఫస్ట్ లుక్, టీజర్, మేకింగ్ అంటూ కొన్ని మాత్రమే రిలీజ్ చేశారు.

పోటీ అవుతుందని అనుకున్నా…

ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న వస్తుందని కరెక్ట్ గా దాని తరువాత రోజు ఫిబ్రవరి 8న వస్తే బాగుంటుందని అనుకున్నారు యాత్ర మేకర్స్. పోటీ కూడా గట్టిగా ఉంటుందని అంతకుమించి ప్రమోషన్స్ ఏమి కావాలనుకున్నారు. కానీ మహానాయకుడు హ్యాండ్ ఇచ్చింది. వారం రోజులు దాటి మరో డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దీంతో యాత్ర సింగిల్ గానే ఉండడంతో పోటీ ఏమీ లేదని అంతా మాట్లాడుకోవడం తగ్గించేశారు. ఎన్టీఆర్ మహానాయకుడు మీద కూడా అంతగా బజ్ ఏమీ లేదు. మరీ ఈ పోటీలో వారం గ్యాప్ తో రెండు సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News