మహానాయకుడు క్లైమాక్స్ ఇదేనా?

వచ్చే శుక్రవారమే బాక్సాఫీసు దగ్గర భారీ యుద్దానికి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకు ఒక వార్త ప్రచారంలోకి వస్తుంది. కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, [more]

Update: 2019-02-19 03:36 GMT

వచ్చే శుక్రవారమే బాక్సాఫీసు దగ్గర భారీ యుద్దానికి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకు ఒక వార్త ప్రచారంలోకి వస్తుంది. కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కథానాయకుడు లోపాలు రిపీట్ కాకుండా మహానాయకుడికి రీ షూట్స్ చేసి మరీ… సినిమాని ప్రేక్షకులు మెప్పించేలా తీర్చిదిద్దారని టాక్ నడుస్తుంది. కథానాయకుడు మీదున్న ఇంట్రెస్ట్ మహానాయకుడు మీద కలగడం లేదంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా వార్తలొస్తూనే ఉన్నాయి. అలాగే బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కూడా మహానాయకుడు మీద మౌనం వహిస్తున్నారు.

ఇక తాజాగా మహానాయకుడు క్లైమాక్స్ మీద కూడా కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథానాయకుడు సినిమా ఓపెనింగ్ షాట్.. బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతూ… తన పెళ్లి ఆల్బమ్స్ చూస్తూ ఎన్టీఆర్ జీవితాన్ని తన కొడుకు హరికృష్ణకి చెప్పడంతో మొదలు పెడతారు.. అయితే మహానాయకుడు సినిమా క్లైమాక్స్ లో బసవతారకం కేరెక్టర్ ని క్యాన్సర్ మహమ్మారి కబళించడంతో.. మరణిస్తుంది.. అదే మహానాయకుడు క్లైమాక్స్ లో చూపించబోతున్నారట. మరి మహానాయకుడు ట్రైలర్ లో ఎన్టీఆర్ రాజకీయాలతో సతమవుతూ.. భార్య ఆరోగ్యంపై కూడా ఆందోళలనతో ఉన్నప్పుడు.. నాదెండ్ల భాస్కర్ రావు…. భార్య ఆరోగ్యం సంగతి చూసికుని..నిశ్చింతగా వెళ్ళిరండి.. ఇక్కడ రాజకీయాలను నేను చూసుకుంటా అని చెప్పడం బట్టి.. బసవతారకం మరణమే మహానాయకుడు క్లైమాక్స్ అనేది నిజమనిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం, చంద్రబాబు.. మామ ఎన్టీఆర్ కి వెన్ను పోటు పొడవడం అనేది రెండు కీలకమైన ఘట్టాలు. అయితే మహానాయకుడు సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్ మాత్రమే ఉంటుందని.. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అవడం వరకే సినిమా ఉంటుందని చెబుతున్నారు. అంటే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం మహానాయకుడు లొ స్కిప్ చేసేశారన్నమాట. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ గా, విద్య బాలన్ బసవతారకంగా నటిస్తున్న ఈ సినిమా రేపు శుక్రవారం విడుదలై ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. అసలే ప్రమోషన్స్ వీక్ గా ఉన్న ఈసినిమాకి… పాజిటివ్ టాక్ పడితే.. దానికదే హిట్ ట్రాక్ ఎక్కుతుంది. లేదా సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ వచ్చిన మహానాయకుడు సినిమాకి ప్రమాదం పొంచి ఉంది.

Tags:    

Similar News