మహానటి తర్వాత రంగస్థలం..!

Update: 2018-12-14 08:14 GMT

ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్ (ఐఎఫ్ డీబీ) 2018 ఏడాదికి గాను టాప్ 10 మూవీస్ లిస్ట్ ని వదిలింది. ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్ అంటే ప్రతి సంవత్సరం విడుదలవుతున్న కొత్త సినిమాలు ఎలా ఉన్నాయనేది ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో ఈ సంస్థ అన్ని భాషల సినిమాలను పరిగణనలోకి తీసుకుని మరీ టాప్ టెన్ ర్యాంక్స్ ఇస్తుంది. ఈ ఏడాది ఆ టాప్ 10 ర్యాంక్స్ లో తెలుగు నుండి రెండు సినిమాలు, తమిళం నుండి రెండు సినిమాలు, బాలీవుడ్ నుండి ఆరు సినిమాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తెలుగులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన మహానటి, రంగస్థలం ఐఎండీబీ టాప్ 10 లో నిలవగా, తమిళం నుండి రాక్షసన్, 96 సినిమాలు నిలిచాయి. ఇక బాలీవుడ్ నుండి అంధాదున్, బడాయిహో, ప్యాడ్ మ్యాన్, స్త్రీ, రాజీ, సంజు చిత్రాలు టాప్ 10 జాబితాలో టాప్ లిస్ట్ లో నిలిచాయి.

రంగస్థలాన్ని దాటిన మహానటి

ఇక తెలుగు నుండి టాప్ 10 లో మహానటి నాలుగో స్థానంలో, రామ్ చరణ్ రంగస్థలం 7వ స్థానంలో నిలిచాయి. దీన్ని బట్టి ఈ ఏడాది ప్రేక్షకులు గట్టిగా మెచ్చిన చిత్రం మహానటి అని రుజువైంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ఈ మీడియం బడ్జెట్ చిత్రం సూపర్ హిట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం ఈ ఏడాది భారీ బడ్జెట్ గా తెరకెక్కిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. అయితే ఇలా ప్రేక్షకులు మెచ్చిన చిత్రాల్లో రంగస్థలాన్ని దాటి మహానటి ముందుకెళ్లిపోయింది. అంటే రామ్ చరణ్ రంగస్థలం కన్నా ఎక్కువగా ప్రేక్షకులు మహానటినే ఆదరించారు. ఇక తమిళనాట రాక్షసాన్ టాప్ లో రెండవ స్థానంలో, త్రిష 96 టాప్ 3లో నిలిచాయి. ఈ ఏడాది ఐఎండీబీ టాప్ 1లో బాలీవుడ్ మూవీ అంధాదున్ ఉంది.

Similar News