పవన్ ని వెనక్కి నెట్టి.. మహేష్ ని టార్గెట్ చేసింది!

Update: 2018-05-19 09:00 GMT

మహానటి రెండు తెలుగు రాష్ట్రాలకు దీటుగా ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటుతుంది. మహానటి మూవీ విడుదలయ్యే ముందు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా విడుదలయ్యాక మహానటి ప్రభంజనం ఏమిటో అర్థమయ్యింది. మహానటి సినిమా ముందు అల్లు అర్జున్ నా పేరు సూర్య చేతులెత్తేసింది. స్టార్ హీరో లేకుండా థియేటర్స్ లో కలెక్షన్స్ పరంగా వీరబాదుడు బాదిన మహానటి ఇప్పటికి కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఓవర్సీస్ పవన్ కళ్యాణ్ రికార్డులకు మహానటి ఎసరు పెట్టింది. ఓవర్సీస్ లో నిన్ననే 2 మిలియన్ మార్క్ అందుకున్న మహానటి ఈ వీకెండ్ లో ఇంకా జోరుని పెంచడం ఖాయంగా కనబడుతోంది. తాజాగా వచ్చిన మహానటి వసూళ్లతో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, భాగమతిలను దాటేసి ఏకంగా మహేష్ భరత్ అనే నేనుకి టార్గెట్ పెట్టుకుంది.

మరో వారం పాటూ ప్రభంజనమే...

మరి మరోవారం రోజుల పాటు అంటే నెల టికెట్ సినిమా థియేటర్స్ లోకి దిగేవరకు మహానటి ప్రభంజనం థియేటర్స్ లో కొనసాగనుంది. మరి ఈ లెక్కన మహేష్ ‘భరత్’ వసూళ్లను మహానటి టచ్ చెయ్యకపోయినా దరిదాపుల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. ఇక ఓవర్సీస్ లో టాప్ సినిమాల వసూళ్లు వివరాలు.

రామ్ చరణ్ -రంగస్థలం 3,510,355

మహేష్ - భరత్ అనే నేను 3,384,023

పవన్ కళ్యాణ్ - అజ్ఞాతవాసి 2,065,527

కీర్తి సురేష్ - మహానటి- 2,016,652(రెండో వారం)

అనుష్క - భాగమతి 1,108,116

Similar News