చిరు సరసన మహానటి..?

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబో సైరా నరసింహారెడ్డి షూటింగ్ జపాన్ లో జరుగుతుంది. మే చివరికల్లా సైరా షూటింగ్ ఒక కొలిక్కి వస్తుందని, తర్వాత చిరు [more]

Update: 2019-04-09 09:17 GMT

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబో సైరా నరసింహారెడ్డి షూటింగ్ జపాన్ లో జరుగుతుంది. మే చివరికల్లా సైరా షూటింగ్ ఒక కొలిక్కి వస్తుందని, తర్వాత చిరు కొరటాల సినిమాతో సెట్స్ మీదకు వెళతాడనే న్యూస్ ఉంది. జూన్ నుండి కొరటాల – చిరు కాంబో మూవీ పట్టాలెక్కబోతుననట్లుగా తాజా సమాచారం. అయితే కొరటాల – చిరు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిరుతో కొరటాల ఫోటో షూట్ కూడా చేశాడన్నారు. ఈ సినిమా సోషల్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో చిరు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో చేస్తున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది.

ఛాన్స్ కొట్టిసిన కీర్తి సురేష్

ఇంకా ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా, కాజల్ పేర్లు వినబడ్డాయి. కానీ తాజాగా కొరటాల.. చిరు కాంబో మూవీలో మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా లేటెస్ట్ టాక్. మహానటి తర్వాత తమిళ సినిమాలు చేసిన కీర్తి క్రేజ్ తగ్గిపోయింది. తమిళనాట వరుస ఫ్లాప్స్, తెలుగులో ఒక్క ఆఫర్ లేకపోవడంతో కీర్తి సురేష్ ఈమధ్యనే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. తాజాగా తెలుగులో ఒక లేడి ఓరియెంటెడ్ ఫిలిం చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు చిరు సరసన ఛాన్స్ కొట్టేసిందని న్యూస్ వినబడుతుంది. మరి మహానటితో మంచి మార్కులే కొట్టేసిన కీర్తి ఇప్పుడు చిరు సరసన ఎలాంటి పాత్ర చెయ్యబోతుందో ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

Tags:    

Similar News