'మహానటి' ప్రభంజనం..!

Update: 2018-05-23 07:40 GMT

'మహానటి' సినిమా రిలీజ్ అవ్వకుముందు మహా అయితే ఈ సినిమా ఓవరాల్ గా 20 కోట్లు వసూలు చేస్తుంది అని అనుకున్నారు అంతా. ఒకవేళ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా వసూళ్లు ఏమి అంతగా గొప్పగా ఉండవని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తప్పని రుజువు చేసింది ‘మహానటి’. సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళ్తున్నారు. తొలి రోజు ఈవినింగ్ షోస్ నుండి థియేటర్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి. వీక్ డేస్, వీకెండ్స్ అని తేడా లేకుండా ఈ సినిమా వసూళ్లతో సాగుతుంది. రెండో వీకెండ్ కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో సాగుతుండటం విశేషం. ఈ సోమవారం నాటికి రూ.30 కోట్ల మైలురాయిని కూడా టచ్ చేసింది.

అన్నీ చోట్ల భారీ షెర్స్...

నైజాంలో రూ.8 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ సాధించడం విశేషం. అలానే ఉత్తరాంధ్రలో రూ.2.25 కోట్లు, సీడెడ్లో రూ.1.7 కోట్లు, మిగతా ఏరియాల్లో కలిపి రూ.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. తమిళంలో రూ.2 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం. అటు ఓవర్సీస్ లో కూడా ఇదే జోరు. అమెరికాలో ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకి అమ్మినట్టు తెలుస్తుంది. కానీ కొన్ని ఏరియాస్ మాత్రం నిర్మాత అశ్వినీదత్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. దాని వల్ల ఆయనకు మంచి ఫలితమే దక్కింది.

Similar News