'మహానటి' హక్కులకి 'మహా' రేటు

Update: 2018-05-14 08:54 GMT

ఈ ఏడాది మొదట్లో పెద్ద సినిమాలు బోల్తా కొట్టినప్పటికీ మార్చ్ నుంచి మళ్ళీ పెద్ద సినిమాల హడావిడి మొదలైంది. రామ్ చరణ్ రంగస్థలం తో ఈ ఏడాది బిగ్ బోణి కొట్టాడు. మళ్ళీ ఆ రేంజ్ లోనే మహేష్ బాబు భరత్ అనే నేను తో మంచి విజయాన్ని సాధించాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల హవా ముగియకముందే మహానటి తో నాగ్ అశ్విన్ బీభత్సమైన హిట్ కొట్టాడు. కేవలం 20 నుండి 30 కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించిన అశ్వినీదత్ కూతుళ్లు ఈ సినిమా తో భారీ మొత్తంలో వెనకేసుకున్నారు. నాగ్ అశ్విన్ ఎంతో చాకచక్యంగా అందరినీ మెప్పించేలా మహానటి సినిమాని తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ మీద బడా హీరోల కన్ను పడడమే కాదు మెగా హీరోలు కూడా నాగ్ అశ్విన్ కి గాలం వేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి మహానటి టీమ్ ని అభినందించగా, తాజాగా అల్లు అర్జున్ మహానటి టీమ్ కి మంచి ట్రీట్ కూడా ఇచ్చేసాడు.

11 కోట్లుకు అమ్ముడుపోయి.....

ఇక ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న మహానటి మూవీ శాటిలైట్ హక్కులు నిన్నమొన్నటివరకు అమ్ముడు పోలేదు. విడుదలకు ముందు అశ్వినీదత్ చెప్పిన రేటుకు రెండుమూడు ఛానల్స్ పోటీపడినా అప్పుడు ఆ ఛానల్స్ ధైర్యం చేయలేకపోయాయి. కానీ సినిమా విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్నాక అశ్వినిదత్ చెప్పిన 10 కోట్ల శాటిలైట్ హక్కులు కాస్తా ఇప్పుడు 11 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ 11 కోట్ల తో మహానటి శాటిలైట్ హక్కులను జి ఛానల్ వారు చేజిక్కించుకున్నారు. మరి ఈ రేటుకి మహానటి అమ్ముడు పోవడం అంటే మాములు విషయం కాదు. ఒక బడా హీరో సినిమా శాటిలైట్ హక్కుల రేంజ్ లో మహానటి హక్కులు అమ్ముడు పోయాయి. అలాగే అశ్వినీదత్ మహానటికి పెట్టిన పెట్టుబడిలో సగం శాటిలైట్ హక్కులు సంపాదించి పెట్టాయి. మరి గత బుధవారం ప్రేక్షకుల ముందుకు విచ్చిన మహానటి తో అశ్వినీదత్ కి భారీ లాభాలు వచ్చాయనడానికి ఈ శాటిలైట్ హక్కులే ఉదాహరణ.

Similar News