Maa : చిరంజీవికి అందని ఆహ్వానం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి [more]

Update: 2021-10-16 06:25 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ప్రకాష‌ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.

చిరంజీకి నో ఇన్విటేషన్…

అయితే మా సభ్యుల ప్రమాణస్వీకారానికి అగ్రనటులందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఆహ్వానం అందలేదంటున్నారు. దీనిపై కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం పాలకమండలి సమావేశమై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News