Maa : విష్ణు కామెంట్స్ ఎఫెక్ట్… మూకుమ్మడి రాజీనామాలకు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా ఇంకా వేడి చల్లారలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిన్న మంచు [more]

Update: 2021-10-12 09:08 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా ఇంకా వేడి చల్లారలేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిన్న మంచు విష్ణు చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలతో వారు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు చెందిన ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా గెలిచారు.

విష్ణు వ్యాఖ్యలతో…..

నిన్న మంచు విష్ణు మాట్లాడుతూ తనను పోటీ నుంచి తప్పుకోవాలని చిరంజీవి కోరారని అన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా తనకు ఓటు వేయలేదని తనకు తెలుసునని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలసింది. వీరు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మీడియా సమావేశంలో వారి రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే మంచు విష్ణు మాత్రం ఆ రాజీనామాను ఆమోదించనని చెప్పారు.

Tags:    

Similar News