కార్తికేయ.. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో సింహ మూవీ?

రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్. మరి ఆయన ఫ్యామిలీ నుండి వచ్చిన వారిలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే. రాజమౌళి సినిమాల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో రాజమౌళి [more]

Update: 2019-12-28 05:35 GMT

రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్. మరి ఆయన ఫ్యామిలీ నుండి వచ్చిన వారిలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే. రాజమౌళి సినిమాల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో రాజమౌళి ఫ్యామిలీ మార్క్ ఉంటుంది. ఇక అయన కొడుకు కార్తికేయ అయితే రాజమౌళి కి రైట్ హ్యాండ్. అంతేనా.. ఆకాశవాణి సినిమా నిర్మాతగా ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే గత జనవరిలోనే షూటింగ్ ఫినిష్ అయ్యిందిలే అనుకున్న ఆకాశవాణి సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు అది వేరే విషయం. ఇప్పుడు తాజాగా కీరవాణి కొడుకు కాల భైరవ, సింహ పేర్లు టాలీవుడ్ లో మార్మోగిపోతున్నాయి. కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా… సింహ హీరోగా చేసిన మత్తు వదలరా సినిమా హిట్ అవడంతో. కీరవాణి సంతోషంలో మునిగి తేలుతున్నాడు. అయితే రాజమౌళి చేస్తున్న బడా మల్టీస్టారర్ #RRR ని పక్కనబెట్టి మరీ మత్తువదలరా సినిమాని రాజమౌళితో సహా ఫ్యామిలీ మొత్తం తెగ ప్రమోట్ చేసింది.

తాజాగా ఫిలింనగర్ టాక్ ఏమిటంటే .. మత్తువదలరా సినిమాతో నార్మల్ గా హీరో గా ఎంట్రీ ఇచ్చిన సింహ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా చేస్తాడేమో..దానికి కాల భైరవ మ్యూజిక్ తో పాటుగా కార్తికేయ ప్రొడ్యూసర్ గా సినిమా తెరకెక్కితే బావుంటుంది అనే టాక్ వినబడుతుంది. మత్తువదలరా సినిమాని మైత్రి మూవీస్ లో బడ్జెట్ తో నిర్మించింది. ఇక సింహ మొదటి సినిమాతోనే హీరోగా తనేంటో నిరూపించుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టి కార్తికేయ సినిమా చేస్తే.. దానికి కాల భైరవ బెస్ట్ మ్యూజిక్ ఇస్తే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని రాజమౌళి అభిమానులు అంటున్నారు . మరి ఫ్యూచర్ లో కార్తికేయ ప్రొడ్యూసర్ గా కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సింహ హీరోగా సినిమా వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News