ఆ… అమ్మడికే ఎందుకన్ని ఛాన్స్ లు

పూజ హెగ్డే ఇంతవరకు నటించిన తెలుగు సినిమాలేవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. మహర్షి కానీ, అరవింద సమేత కానీ యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. కానీ అమ్మడు [more]

Update: 2019-09-17 06:37 GMT

పూజ హెగ్డే ఇంతవరకు నటించిన తెలుగు సినిమాలేవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. మహర్షి కానీ, అరవింద సమేత కానీ యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. కానీ అమ్మడు అదృష్టం బాగుంది.. పూజ కి లక్కీగా ఛాన్స్ ల మీద ఛాన్సులొస్తున్నాయి. తాజాగా పూజ హెగ్డే నటించిన వాల్మీకి రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. వాల్మీకి లో అసలు పూజ అవసరం లేకపోయినా.. దర్శకుడు హరీష్ కావాలని వరుణ్ తేజ్ కోసం వాల్మీకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్రియేట్ చేసి పూజ ని సెట్ చేసాడు.

పూజకి హెల్పా.. లేక వాల్మీకికా?

మరి చాలా తక్కువ నిడివున్న పాత్రలో పూజ ఈ సినిమాలో నటించింది. ఇప్పటివరకు బయటికొచ్చిన పూజ లుక్స్ బావున్నాయి. ఇక తాజాగా విడుదలైన పూజ – వరుణ్ ల రీమిక్స్ సాంగ్ విజువల్స్ లో కూడా పూజ అదిరిపోయింది. మరి తమిళనాట సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో హిట్ కొడుతుందని నమ్మకంగా చెప్పలేం. ఎందుకంటే దర్శకుడు ఈ సినిమాని ఉన్నది ఉన్నట్టుగా తియ్యకుండా తన టాలెంట్ తో సినిమా లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టాడు. వరుణ్ తేజ్ ని మరీ నెగెటివ్ గా కాకుండా… కాస్త హీరోయిజాన్ని ఎలివేట్ అయ్యే సీన్స్ జోడించాడు అందుకే పూజ వచ్చింది. మరి ఈ సినిమా తెలుగులో హిట్ అయితే పూజ కి కలిసొస్తుందో.. లేదంటే పూజ క్రేజ్ వాల్మీకి
కలిసొస్తుందో చూద్దాం.

 

Tags:    

Similar News