ఆ విషయంలో ఆచార్యకి ప్రాబ్లమే

భరత్ అనే నేను సినిమా తర్వాత గత రెండు సంవత్సరాలుగా చిరంజీవితోనే ట్రావెల్ చేస్తూ కొరటాల శివ మెగా కాంపౌండ్ లోనే ఉండిపోయాడు. ఒక్క సినిమాకి ఇంత [more]

Update: 2021-02-02 13:12 GMT

భరత్ అనే నేను సినిమా తర్వాత గత రెండు సంవత్సరాలుగా చిరంజీవితోనే ట్రావెల్ చేస్తూ కొరటాల శివ మెగా కాంపౌండ్ లోనే ఉండిపోయాడు. ఒక్క సినిమాకి ఇంత టైం తీసుకోవడం, కరోనా ఎఫెక్ట్ కూడా యాడ్ అవడం కొరటాలకి మెగా కాంపౌండ్ లోనే కట్టిపడేసింది. ఆచార్య సినిమా తీసుకుంటూ పోతున్నాడు. అటు చిరంజీవి – కాజల్ అగర్వాల్ ఎపిసోడ్ , ఇటు రామ్ చరణ్ – పూజ హెగ్డే ఎపిసోడ్ ఇక కథలో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్, భారీ యాక్షన్ సీన్స్ ఇలా అన్ని కలిపి ఆచార్య సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాల వరకు వస్తుంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ లెంత్ ని కొరటాల ఎలా కట్ చేస్తాడు? ఏం తీస్తారో.. ఏం ఉంచుతారో. కానీ ఇప్పుడు కొరటాల శివ కి ఇది అగ్ని పరీక్షలా మారబోతుంది. 
ఎందుకంటే రామ్ చరణ్ జస్ట్ గెస్ట్ రోల్ కింద అనుకుని.. తర్వాత చిరు భార్య సురేఖ కోరిక మేరకు, అలాగే ఆచార్య పై క్రేజ్ పెంచడానికి రామ్ చరణ్ గెస్ట్ రోల్ నిడివి పెంచేసిన కొరటాల ఆ రోల్ కి అదిరిపోయే గ్లామర్ గర్ల్ పూజ హెగ్డే ని తీసుకోవడం, ఓ డ్యూయెట్ పెట్టడం, మరోపక్క చిరంజీవి ఎలివేషన్ సన్నివేశాలు, మరోపక్క రామ్ చరణ్ హీరోయిజం అన్ని కలిపి ఆచార్య నిడివిని పెంచేసాయి. ఇప్పుడు రామ్ చరణ్ కేరెక్టర్ తగ్గించాలన్నా ప్రోబ్లేమే. అలానే చిరు సన్నివేశాలు తగ్గివుంచాలన్నా కష్టమే. ఆచార్య అంటేనే చిరు. చిరు అంటేనే ఆచార్య. మరి ఇప్పుడు కొరటాల ఎం చేస్తాడుఅనేది ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News