సి. కళ్యాణ్ చేతికి ప్రభుదేవ 'లక్ష్మి'..!

Update: 2018-08-01 11:14 GMT

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్... ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'లక్ష్మీ' సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది. డ్యాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమాలో దిత్య డ్యాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్

కాగా, నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా ఆడియో, రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ఆగస్టు 12న ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగస్టు 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కోవై సరళ, సల్మాన్ యూసఫ్ ఖాన్, చామ్స్, అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

Similar News