బాలీవుడ్ పై కన్నేసిన రాక్షసి

Update: 2018-07-20 07:34 GMT

ఏ హీరో.. హీరోయిన్ అయినా తమ ప్రాంతీయ సినిమాల్లో నటించి కొంచం పేరు రాగేనే బాలీవుడ్ లో ఒక్క సినిమా ఐన చేయాలి అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చేస్తే ప్రపంచం వ్యాప్తంగా క్రేజ్ వస్తుంది కాబట్టి. అయితే ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోకస్ పెడుతుంటారు. అలానే చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు.

అయితే ఈ లిస్ట్ తాజాగా మన టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ప్రస్తుతం అందాల రాక్షసి బాలీవుడ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఆ అందాల రాక్షసి ఎవరు అని అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టే. ఆ అందాల రాక్షసి ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా త్వరగానే తెలుగులో మంచి క్రేజీ హీరోయిన్ గా మారింది.

అయితే ఈ మధ్యే ఆమె కు ఆశించిన స్థాయి విజయాలు దక్కడం లేదు అందుకే .. అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో లావణ్య కన్ను బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో అవకాశాలు కోసం పలువురు బాలీవుడ్ మేకర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుందని టాక్. వన్స్ అక్కడ ఛాన్స్ వస్తే బట్టలు సద్దుకుని వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది.

Similar News