అమ్మా లావణ్యం నీ పరిస్థితి ఏమిటి!

Update: 2018-07-17 05:36 GMT

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి లైం టైం లో లేని హీరోయిన్. ఆమె నటించిన సినిమాలన్నీ వరసబెట్టి ఫ్లాప్ అయ్యేసరికి అమ్మడుకి అంతగా అవకాశాలు లేకుండా పోయాయి. మిష్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటిలిజెంట్ చిత్రాల ఫ్లాప్ లతో లావణ్య పనైపోయింది. ట్రెడిషనల్ గా ఉంటే.. అవకాశాలు రావని తెలిసిన లావణ్య తాను ట్రెడిషనల్ కాదని మోడ్రెన్ లుక్ ని పరిచయం చేసింది. మోడరన్ గా ఎంతగా రెచ్చిపోయినా లావణ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో నిఖిల్ తో కలిసి నటిస్తున్న ముద్ర సినిమాతో పాటు వరుణ్ తేజ్ సినిమా అంతరిక్షం ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఆడినా అమ్మడు గట్టెక్కేస్తుంది. లేదంటే ఇక లావణ్య లగేజి సర్దుకోవాల్సిందే. ఇక ప్రస్తుతం నిఖిల్ తో జోడి కట్టిన ముద్ర సినిమా అందరిలో మంచి ఆసక్తిని కలగజేస్తుంది. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో.. ఆ సీన్స్ ఒరిజినాలిటీ కోసం ఆ ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు.

రెండింటిలో ఒక్కటైనా..?

నిఖిల్ రిపోర్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో లావణ్య రోల్ కూడా కీలకమే అని చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం లావణ్య త్రిపాఠి, నిఖిల్ జోడి మీద అతి కీలక సన్నివేశాలను మూవీ యూనిట్ చిత్రీకరిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ మీడియం రేంజ్ హీరోల సరసన అవకాశాలు పట్టేయాలనే యోచనలో లావణ్య త్రిపాఠి ఉంది. ఇక వరుణ్ తేజ్ పక్కన అంతరిక్షం సినిమాలో లావణ్య త్రిపాఠి ఒక హీరోయిన్. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ భామ, సమ్మోహనం హీరోయిన్ అదితి రావు కూడా నటిస్తుంది. మరి సోలోగా ముద్ర సినిమాలో అవకాశాన్ని పట్టేసిన లావణ్య త్రిపాఠి కి ఆ సినిమా హిట్ అయిందా ఓకే.. లేదంటే.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీ హిట్ అయినా ఓకె. ఒకవేళ రెండు సినిమాల ఫలితాలు అటు ఇటు అయ్యాయా.. లావణ్య లగేజ్ సర్దుకుని ఇంటికెళ్లిపోవడమే.

Similar News