గ్లామర్ అంటే ఎక్సపోసింగ్ కాదు?

హీరోయిన్స్ కి గ్లామర్ గా ఉండాలని.. ఎక్స్పోజింగ్ చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే గ్లామర్ గా ఉండి.. ఎక్సపోజింగ్ చేస్తేనే కెరీర్ లో పది కాలాల పాటు నిలబడతామని [more]

Update: 2020-09-21 06:02 GMT

హీరోయిన్స్ కి గ్లామర్ గా ఉండాలని.. ఎక్స్పోజింగ్ చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే గ్లామర్ గా ఉండి.. ఎక్సపోజింగ్ చేస్తేనే కెరీర్ లో పది కాలాల పాటు నిలబడతామని వాళ్ళ ఫీలింగ్. చాలామంది తారలు ఈ గ్లామర్ నే నమ్ముకున్నారు కూడా. మరి ట్రెడిషనల్ గా, నటనకే ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ చాలామంది కెరీర్ నాలుగైదు సినిమాలకే ముగిసిపోతుంది. అందుకే చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే గ్లామర్ ఒలకబోస్తూ.. ఎక్సపోజింగ్ అంటూ షార్డ్స్, బికినీస్ వేసుకుని హాటెస్ట్ ఫొటోస్ షూట్స్ చేయించేస్తుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం గ్లామర్ అంటే ఎక్సపోజింగ్ కాదంటుంది. ఆమె లావణ్య త్రిపాఠి. నా దృష్టిలో గ్లామర్ అనేది ఎక్సపోజింగ్ కాదని.. గ్లామర్ అంటే కళ్ళు, హావభావాల ప్రదర్శనలోనే ఉంటుంది అంటుంది.

మనం వేసుకునే బట్టల ద్వారానే మనం గ్లామర్ గా కనిపిస్తాం అని అనుకోకూడదు. గ్లామర్ ఉండడం అంటే పొట్టి నిక్కర్లు వేసుకుని, బికినీ వేసుకుని, స్కర్ట్స్ వేసుకుని క్లివేజ్ షో చెయ్యడం కాదు. మోడరన్ దుస్తుల్లో కనిపించడమే గ్లామర్ అని చాలామంది ఆనుకుంటారు. కానీ నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్సపోజింగ్ కాదు. గ్లామర్ వేరు, ఎక్సపోజింగ్ వేరు. అలంకరణే గ్లామర్ కాదు. ఏం చేసినా మనం పాత్రల పరిధిలోనే చెయ్యాలి. కొంతమంది దర్శకులు రాసుకునే పాత్రల అల్లికలోనే గ్లామర్ దాగి ఉంటుంది. అలాంటి పాత్రలు దక్కడం అనేది అదృష్టం ఉంటె కానీ రావు. అయినా ఇప్పుడు అలంటి కథలు, అలాంటి పాత్రలే కరువయ్యాయంటుంది ఈ భామ

Tags:    

Similar News