బ్యాడ్ లక్ అంటే ఈ హీరోయిన్ దే..!

Update: 2018-08-20 09:43 GMT

అందాల రాక్షసి సినిమాలో ట్రెడిషనల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనబడి.. రాధా సినిమా దగ్గర నుండి గ్లామర్ గేట్లు ఎత్తేసినా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి లక్కు కలిసి రావడం లేదు. వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న లావణ్య త్రిపాఠి చేజారిన రెండు అవకాశాలు చూస్తుంటే ఇప్పుడు పాపం లావణ్య అనిపిస్తుంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ముద్ర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కనీసం హిట్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. అయితే హిట్ హీరోయిన్ అనిపించుకునేదే.. కానీ అనుకోకుండా రెండు అవకాశాలు తప్పిపోవడంతో.. ఇప్పుడు అన్ లక్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

తమిళ సినిమా కోసం

గత ఫిబ్రవరిలో వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమాలో లావణ్య త్రిపాఠికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. అలాగే మెహ్రీన్ కౌర్ కి కూడా తొలిప్రేమ సినిమాలో కాస్త లావుగా ఉన్న కారణంగా ఆమె అవకాశం రాశి ఖన్నా తన్నుకుపోయింది. ఆ విధంగా ఒక సూపర్ హిట్ లావణ్య చేజారిపోయింది. ఆ సినిమాతో రాశి ఖన్నా మంచి హిట్ అందుకుని.. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలు తన్నుకుపోతుంది. ఇక తాజాగా సూపర్ హిట్ అయిన గీత గోవిందం సినిమా అవకాశాన్ని లావణ్య త్రిపాఠి ఒక తమిళ సినిమా కోసం చేజార్చుకోవడం చూస్తుంటే మాత్రం అయ్యో పాపం అనిపిస్తుంది.

ముద్ర అయినా కలిసి వస్తుందా..?

లావణ్య త్రిపాఠి ని దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండ పక్కన ఎంపిక చేద్దామని సంప్రదించగా.. ఆమెకి తమిళ అవకాశం ఉండడం.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో.. హిట్ సినిమా గీత గోవిందం అవకాశం వదులుకుంది. ఇది నిజంగా బ్యాడ్ లక్కే. ఇక ఈ విషయాన్ని గీత దర్శకుడు పరశురామ్ స్వయంగా చెప్పాడు. అలాగే మరో హీరోయిన్ కూడా అన్ లక్కినే. అను ఇమ్మాన్యువల్ ని కూడా గీత గోవిందం సినిమా కోసం సెలెక్ట్ చేసి కొన్ని సీన్స్ షూట్ చేశాకే ఆమె శైలజ రెడ్డి కోసం తప్పుకుంది. మరి లావణ్యకి గీత గోవిందం లాంటి హిట్ సినిమా మిస్ అవడం మాత్రం పరమ బ్యాడ్ లక్ అనాల్సిందే. మరి ఒకే ఏడాది రెండు హిట్ సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకున్న లావణ్యకి ముద్ర సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Similar News