క్రేజ్ తగ్గిపోవడానికి కారణం అదేనా

తమిళంలో రిలీజ్ అయ్యే పెద్దపెద్ద సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఒక్కప్పుడు తమిళ హీరోస్ సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు హీరోస్ భయపడేవారు. కానీ కొన్ని [more]

Update: 2019-09-23 08:38 GMT

తమిళంలో రిలీజ్ అయ్యే పెద్దపెద్ద సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఒక్కప్పుడు తమిళ హీరోస్ సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు హీరోస్ భయపడేవారు. కానీ కొన్ని ఏళ్ళ నుంచి తమిళ అనువాద చిత్రాలని చూడడం తగ్గించేశారు మన తెలుగు ప్రేక్షకులు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాలు కూడా ఇక్కడ జనాలు చూడడం లేదు అంటే తమిళం వాళ్ళ మార్కెట్ ఎంతలా పడిపోయిందో ఆలోచించవచ్చు. ఒక్క లారెన్స్‌ ‘కాంచన’ చిత్రాలు మినహా తెలుగులో మరియే చిత్రాలు ఆడట్లేదు.

ఇకవాటి జోలికెళ్లరు….

ఒక్కప్పుడు రజిని సినిమాలు తెలుగులో ముప్పయ్‌, నలభై కోట్లు పలికేవి కానీ ఇప్పుడు పది కోట్లు కూడా పలకడం కష్టమైంది. అలానే సూర్య, విక్రమ్ ల సినిమాలకి కూడా మంచి మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు అది సగానికి పైగానే పడిపోయింది. ఇలా ఒకేసారి తమిళ అనువాద చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి కారణం తమిళ వాళ్ళు తీసుకున్న హోప్‌లెస్‌ చిత్రాలే కారణం. మరొకటి ఏంటంటే మన తెలుగు సినిమాల క్వాలిటీ పెరగడం, కంటెంట్‌ పరంగా తెలుగులోనే చాలా వెరైటీ వుండడంతో ఇక తమిళ చిత్రాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. ఈ రెండు కారణాలు వాళ్ళ తమిళ హీరోస్ ఇక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నారు. మునుముందు తమిళ చిత్రాలు తెలుగు లో చూసేవారు ఉండరేమో అనిపిస్తుంది.

 

 

Tags:    

Similar News