ట్రైల‌ర్ విడుద‌ల తేదీ చెప్పిన వ‌ర్మ‌

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ క‌థను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ [more]

Update: 2019-02-10 08:17 GMT

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ క‌థను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపంలో చూపించ‌నున్నాడు ఆర్జీవి. “ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం” అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాదు.. చాలామంది లో చెమటలు పుట్టిస్తోంది. ఈ క‌థ‌ను ముందెన్నడూ వ‌ర్మ చూప‌ని విధానం, తీయని విధానంలో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలియని వాళ్లు కూడా చెప్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు ఆరాధ్యుడిగా వెలుగొందిన ఎన్టీఆర్ క‌థ‌ను “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్”లో ఆవిష్క‌రించ‌బోతున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఈ సినిమాలోని అంశాలు కొంద‌రికి రుచించే అవ‌కాశం లేదు. వెలుగులు పంచిన వ్య‌క్తి చుట్టూ అలుముకున్న చీక‌ట్ల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు విడుద‌ల చేయ‌నున్నాడు.

Tags:    

Similar News