వర్మ సీక్రెట్ గా కానిచ్చేస్తున్నాడా..?

Update: 2018-10-30 08:17 GMT

రామ్ గోపాల్ వర్మ సినిమాలైతే ఫ్లాప్ అవుతున్నాయి కానీ.. ఆయన మాటలు, చేతల్లో పస మాత్రం తగ్గడం లేదు. వర్మకి పిచ్చెక్కిందని కొందరు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ... రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను చేయదలుచుకున్న పనిని చక్కగా పూర్తి చేస్తున్నాడు. గతంలో బాలకృష్ణ తనకి ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తాడనుకుని భంగ పడి.. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని మొదలు పెట్టాడు. అనేక కాంట్రవర్సీలకు నెలవుగా మారిన ఆ సినిమా మధ్యలో అటకెక్కిందని అందరు అనుకునేలా కామ్ అయ్యాడు. కానీ మొన్న దసరాకు మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించాడు.

సీక్రెట్ గా షూటింగ్...

బాలకృష్ణ - క్రిష్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల చేస్తానని చెబుతున్న వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టి రహస్యంగా చేస్తున్నాడనే సమాచారం అందుతుంది. హైద‌రాబాద్‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్ సీక్రెట్ గా జరిగిపోతున్నట్టుగా టాక్‌. అత్యంత ర‌హ‌స్యంగా, భారీ బందోబ‌స్తు మ‌ధ్య వ‌ర్మ షూటింగ్ నిర్వ‌హిస్తున్నాడ‌ట‌. సాధార‌ణంగా త‌న స‌హాయ‌కుల‌కు గైడెన్స్ ఇచ్చి.. సెట్‌కి వెళ్ల‌కుండానే ప‌ని కానిచ్చేస్తుంటాడు వ‌ర్మ‌. కానీ ఇప్పుడు మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల ప్ర‌తీ విష‌యంలోనూ శ్ర‌ద్ద తీసుకుంటున్నాడ‌ట‌. ఆ సినిమా సెట్లో తానే ఉంటున్నాడ‌ట‌.

ఎన్ని కాంట్రవర్సీలో...

అసలు ఇప్పటివరకు తన సినిమాలో ఎవరు నటీనటులుగా నటిస్తున్నారో చెప్పని రామ్ గోపాల్ వర్మ మాత్రం లక్ష్మి పార్వతి పాత్రని హైలెట్ చేసి చూపడమే ధ్యేయంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడనేది నిజం. ఏదో దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని చెప్పినట్టుగా.. రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ లేకుండా సినిమా చెయ్యడం అనేది జరగని పని. ప్రస్తుతం షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా విడుదల సమయానికి మరెన్ని కాంట్రవర్సీలను మూట గట్టుకుంటుందో చూడాలి.

Similar News