అలా అయితే క్రేజ్ ఏముంటుంది..?

ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ అనుకున్నట్లుగానే ఆయన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ట్రేడ్ లో, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఎన్టీఆర్ జీవితంలోని [more]

Update: 2019-03-26 06:58 GMT

ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ అనుకున్నట్లుగానే ఆయన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ట్రేడ్ లో, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఎన్టీఆర్ జీవితంలోని చివరి అంకాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కించిన వర్మ.. ఆ సినిమాతో టీడీపీ, చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీని ఒక ఆటాడుకోవాలనుకున్నాడు. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రోమోస్, ట్రైలర్ కూడా వివాదాలు చెలరేగేలా కట్ చేసి వదిలాడు. మరి వర్మ అనుకున్నట్లుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్, ప్రోమోస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసాయి. చంద్రబాబుని, నందమూరి ఫ్యామిలీని, టీడీపీ నేతలను విలన్స్ గా చూపించిన వర్మకు ఈ సినిమాను విడుదల చెయ్యడం అనేది ఛాలెంజ్ అన్నారు.

క్లీన్ యూ సర్టిఫికేట్

కానీ నందమూరి ఫ్యామిలీ, చంద్రబాబు, బాలయ్య ఎవరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోకుండా వదిలేసారు. ఇక ఎన్నికల టైంలో భారీ హైప్ మూటగట్టుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి కనీసం సెన్సార్ అయినా బ్రేకులేస్తుందేమో అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు మొదట్లో సెన్సార్ చెయ్యమని చెప్పినా చివరకు సెన్సార్ బోర్డు ఆదేశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. మరి సినిమాలో వివాదాస్పద అంశాలేమైనా ఉంటే సెన్సార్ సర్టిఫికెట్ లో తేడాలొచ్చేవి. కానీ ట్రైలర్ లో వివాదాన్ని చూపించిన వర్మ సినిమాలో చూపించలేకపోవడంతోనే సినిమాకి క్లిన్ యూ వచ్చిందంటున్నారు.

ఓపెనింగ్స్ ఖాయం

మరి ఇప్పటివరకు మంచి అంచనాలు, భారీ క్రేజ్ తో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి టాక్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం ఖాయమన్నారు. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ చూస్తే.. సినిమాలో ఏం లేదేమో అందుకే సెన్సార్ వారు క్లీన్ యూ ఇచ్చారు అని ప్రేక్షకుడు అనుకుంటే సినిమాకి దెబ్బే. ఇప్పటివరకు భారీ హైప్ ని మూటగట్టుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవుడు సెన్సార్ సర్టిఫికెట్ తో క్రేజ్ ని కోల్పోతుందేమో అనిపిస్తుంది. మరి భారీ హైప్ మధ్య ఈ ఎలక్షన్స్ మూమెంట్ లో సినిమాని విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనుకున్న వర్మకి ఈ సెన్సార్ సర్టిఫికెట్ షాకిచ్చిందనే చెప్పాలి. ఈ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ క్రేజ్ ఎంతుంది అనేది ఆ సినిమా విడుదలైన మొదటి షో వరకు చెప్పడం కష్టమే.

Tags:    

Similar News