లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏకపక్షమేనా..?

నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు [more]

Update: 2019-03-30 07:01 GMT

నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు షాకిచ్చారు. నిన్న వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చారు రివ్యూ రైటర్స్. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసి పెదవి విరిచారు. ఎందుకంటే అన్ని బయోపిక్స్ లాగే వర్మ కూడా తనకి తెలిసినదాని కన్నా భజనకే ప్రాధాన్యత ఇచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీపార్వతిని హైలెట్ చేయడంతో పాటు గొప్ప వ్యక్తిగా చూపించడం, ఎన్టీఆర్ ఆ వయసులోనూ లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ రొమాన్స్ చేయడం వంటివి ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అలాగే అప్పట్లో పార్టీలో లక్ష్మీపార్వతి కారణంగా అసమ్మతి రాజుకుంది అన్నది జగమెరిగిన సత్యం. లక్ష్మీపార్వతి దూరమై, ఆమె భర్త వీరగంధ్రం సుబ్బారావు మీడియాకు ఎక్కి, ఆమెపై, ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారన్నది జరిగిన సంగతి. పార్టీ చీలిన తరువాత, అధికారం పోయిన వెంటనే లక్ష్మీపార్వతి రాజకీయంగా బహిరంగంగానే వ్యవహరించిన సంగతి అంతకన్నా వాస్తవం.

నిర్మాణ విలువలు అంతంతే..

లక్ష్మీపార్వతి అమాయకురాలు. ఎన్టీఆర్ అంటే ఆమెకు దైవంతో సమానం. కేవలం ఎన్టీఆర్ చరిత్ర రాయడానికి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ ఆమె పట్ల ఆకర్షితుడై పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏనాడూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అన్నట్టుగా చూపిస్తే ప్రేక్షకుడు ఒప్పుకోవవడం కష్టమే అంటున్నారు. ఇక చంద్రబాబు పాత్రని ఎంత విలన్ గా చూపించాలో అంతగా చూపించే ప్రయత్నంలో.. ప్రతి ఫ్రేమ్‌లోనూ కెమెరా అతనిపైనే ఫోకస్‌ పెట్టి, ఎప్పుడూ మైండ్‌లో ఏదో ప్లాన్‌ రన్‌ చేస్తున్నవాడిగా చూపించడం కూడా ప్రేక్షకులకు నచ్చేలా లేదు. సినిమాలో అసలెందుకు అన్ని పాటలు పెట్టారో ఎవ్వరికీ అర్ధం కాదు. క్వాలిటీ లేని నిర్మాణ విలువలు, ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల ప్రేమ ఇవన్నీ బాగా చూపించలేదంటున్నారు.

Tags:    

Similar News