లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఏదో జరుగుతుంది..!

రాంగోపాల్ వర్మ అనుకున్నది అంతా చేసి చూపిస్తున్నాడు. నిన్నటి వరకు కాస్త సైలెంట్ గా కనబడిన వర్మ మళ్లీ టీడీపీ నాయకుల్లో, చంద్రబాబు ఇంట్లో, నందమూరి ఫ్యామిలిలో [more]

Update: 2019-03-09 03:57 GMT

రాంగోపాల్ వర్మ అనుకున్నది అంతా చేసి చూపిస్తున్నాడు. నిన్నటి వరకు కాస్త సైలెంట్ గా కనబడిన వర్మ మళ్లీ టీడీపీ నాయకుల్లో, చంద్రబాబు ఇంట్లో, నందమూరి ఫ్యామిలిలో కుంపటి రాజేస్తూనే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వదులుతున్న పాటలు, ట్రైలర్స్ అన్నీ టీడీపీ, నందమూరి, నారా కుటుంబాల్లో సెగలు రేపుతున్నాయి. మొన్నటికి మొన్న పాటతో బెంబేలెత్తించిన వర్మ.. నిన్న మహిళా దినోత్సవం రోజున వదిలిన ట్రైలర్ తో వర్మ ప్రేక్షకులకు ఏం చూపించాలనుకుంటున్నాడో తేటతెల్లమైంది. చంద్రబాబు మీద వర్మ పగబట్టాడా అనిపిస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవించిన వేదనని వర్మ కళ్ళకు కట్టినట్లుగా చూపించెయ్యబోతున్నాడు ఇది ఫిక్స్. ఏదో మొదటి ట్రైలర్ లో అందరిని మురిపించిన వర్మ .. సినిమాలో ఏం చూపిస్తాడో.. ఎప్పటిలాగే ప్రేక్షకులను మోసం చేస్తాడేమో అనుకున్న ప్రేక్షకులకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సెకండ్ ట్రైలర్ తో మాత్రం పూర్తి క్లారిటీ వచ్చేసింది. లోకేష్ మీద ఒట్టేసి చంద్రబాబు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ జీవితం నుండి పంపెయ్యడానికి ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం, టీడీపీ నేతలు ఎన్టీఆర్ ని నమ్మించి మోసం చెయ్యడం, ఆస్తులు రాయించుకుని ఎన్టీఆర్ ని ఏకాకిని చేసిన నందమూరి ఫ్యామిలీ ఇలా ఏ ఒక్కరినీ వర్మ వదలలేదు.

నంద‌మూరి ఫ్యామిలీ ప్లాన్ ఏంటి..?

మరి ఇంత జరుగుతున్నా నందమూరి ఫ్యామిలిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి స్పందన లేదు. ఇక చంద్రాబు తోకలు ఏదో చిన్నగా హడావుడి చేసినా.. పెద్దగా ఉపయోగం లేదు. కానీ నందమూరి, నారా ఫ్యామిలీలు ఇంత సైలెంట్ గా ఉండడం వెనక ఏదో జరుగుతుంది. తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలా కనబడుతుంది ఇప్పుడు ఈ వ్యవహారం. ఏదో సెన్సార్ కాకుండా సెన్సార్ బోర్డుకి నందమూరి ఫ్యామిలీ చేత నోటీసులు ఇప్పించే ప్రయత్నంలో బాలయ్య ఉన్నట్లుగా ఆ మధ్య వార్తలొచ్చాయి. తీరా చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల టైం దగ్గరకొచ్చేసింది. కానీ ఇప్పటికీ ఆ ఫామిలీస్ నుండి స్పందన లేదు. కనీసం మీడియాకి కూడా చిన్న అనుమానం రాకుండా నందమూరి ఫ్యామిలీతో పాటుగా, బాబు వ్యూహం కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి ఏం చేసి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లోకి రాకుండా అడ్డుకుంటారో చూద్దాం.

Tags:    

Similar News