’లక్ష్మీస్ ఎన్టీఆర్‘కి ఏ సర్టిఫికెట్ వచ్చిందో తెలుసా..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డంకులు ఒక్కోటి తొలగిపోతున్నాయి. ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదల ఆపాలంటూ వచ్చిన ఫిర్యాదును ఇప్పటికే ఎన్నికల సంఘం అంగీకరించలేదు. సినిమా విడుదల [more]

Update: 2019-03-25 13:04 GMT

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డంకులు ఒక్కోటి తొలగిపోతున్నాయి. ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదల ఆపాలంటూ వచ్చిన ఫిర్యాదును ఇప్పటికే ఎన్నికల సంఘం అంగీకరించలేదు. సినిమా విడుదల చుసుకోవచ్చని చెప్పింది. అసలు సెన్సార్ కూడా చెయ్యనని చెప్పిన సెన్సార్ బోర్డు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చెయ్యక తప్పలేదు. మొదట సినిమా అసలు ఈ నెల 29న విడుదలవుతుందా? అని చాలామందికి అనుమానాలు వచ్చినా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ కూడా పూర్తి చేసేసుకుంది. వివాదాలతో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కనీసం సెన్సార్ దగ్గర అయినా ఆగుతుంది అనుకుంటే… ఇప్పుడు తాజాగా సెన్సార్ కూడా పూర్తయ్యింది.

క్లీన్ యూ సర్టిఫికేట్

ట్రైలర్ లో చూపించినట్లుగా సినిమా ఉందో లేదో తెలియదు కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డు. మరి ఎన్నో వివాదాలు మూటగట్టుకుంటుంది అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్చ్ 29న విడుదలకు సిద్ధమవుతుంది. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ పట్టు వదలని విక్రమార్కుడిలా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. సినిమాకి క్లిన్ యూ సర్టిఫికెట్ రావడం అంటే సినిమాలో ఎలాంటి వివాదాలకు చోటు లేదేమో.. అందుకే సెన్సార్ బోర్డు క్లీన్ యూ ఇచ్చేసింది.

Tags:    

Similar News