లక్ష్మీస్ ఎన్టీఆర్ కు తిరుగులేదా..?

ఎన్నో సమస్యలను, అడ్డంకులను దాటుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని విడుదల కాకుండా ఎలాగైనా ఆపాలని టీడీపీ [more]

Update: 2019-03-28 07:05 GMT

ఎన్నో సమస్యలను, అడ్డంకులను దాటుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని విడుదల కాకుండా ఎలాగైనా ఆపాలని టీడీపీ వారు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో సెన్సార్ దగ్గర ఆగుతుంది అనుకున్నోళ్లకి.. నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా.. క్లీన్ యూ సర్టిఫికేట్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ ఎత్తుగడలు ఫలించి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్ గా రేపు వరల్డ్ వైడ్ గా.. ఈ రోజు సాయంత్రం ఓవర్సీసీ లో ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం కాచుకుని కూర్చున్నారు. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మంచి బిజినెస్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టినా ఓవర్సీసీ ప్రీమియర్స్ తో ఎంత కొల్లగొడుతుందో అంటూ ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చర్చించుంటున్నారు.

ఓవర్సీస్ లో ఎలా ఉంటుందో…

తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ తో టేబుల్ ప్రాఫిట్ తో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలకు ఇక్కడి కలెక్షన్స్ కి ఢోకా లేదని.. ఎందుకంటే ఏపీ ఎన్నికల వల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉందని.. అందుకే ఇక్కడ కలెక్షన్స్ లెక్క కాదని.. ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు. ఓవర్సీస్ లో వీకెండ్ సినిమా సంస్థ భారీ మొత్తానికి రైట్స్ తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ లో కీలకమైన యుఎస్ లో దాదాపు 125 పైగా లొకేషన్లలో వీకెండ్ సినిమా సంస్థ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేస్తుండడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మరి ప్రీమియర్స్ తోనే భారీగా లాభపడాలని వీకెండ్ సినిమా సంస్థ యోచనలా కనిపిస్తుంది. మరి సినిమాకి నెగెటివ్ టాక్ పడినా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏముందో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అంటూ ఆర్జీవీ నమ్మకంగా ఉన్నాడు. ఎలాగూ సెన్సార్ వారు కూడా సినిమాకి పాజిటివ్ సర్టిఫికెట్ ఇవ్వడం.. ఈ సినిమాకి ప్లస్ అంటూ వర్మ ప్రచారం చేస్తున్నాడు కూడా.

Tags:    

Similar News