‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

చిత్రం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాస్పదమైంది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత జరిగిన మార్పులు.. ఆమె ప్రవేశించడానికి గల [more]

Update: 2019-04-27 11:05 GMT

చిత్రం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాస్పదమైంది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత జరిగిన మార్పులు.. ఆమె ప్రవేశించడానికి గల కారణాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం ఈ సినిమా రూపొందింది. అయితే ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని అన్ని చోట్ల విడుదల అయింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తప్ప. ఈ చిత్రం మార్చిలో ఏపీ మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విడుదలను నిలిపివేశారు.

ఇప్పటికే ఆన్ లైన్ లో పైరసీ

ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఈ సినిమా విడుదల అవుతుంది. కాగా ఈ చిత్రం మే 1న సినిమాను ఏపీలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా పైరసీ ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా రంగస్థల నటుడు విజయ్‌ కుమార్‌ నటించారు. మే 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News