లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అంత బడ్జెటా..?

రామ్ గోపాల్ వర్మ తాజా సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం మార్చి 22న విడుదల అవుతున్నట్టు సమాచారం. అయితే తాజా సమాచారం 22 కాకుండా [more]

Update: 2019-03-04 08:34 GMT

రామ్ గోపాల్ వర్మ తాజా సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం మార్చి 22న విడుదల అవుతున్నట్టు సమాచారం. అయితే తాజా సమాచారం 22 కాకుండా 15న వస్తే బెటర్ అని కొంతమంది వర్మకి సూచించారట. దీనిపై డెసిషన్ రెండు మూడు రోజుల్లో వర్మ చెప్పనున్నాడు. ఆల్రెడీ సినిమా అమ్మకం పూర్తయిపోయింది. రిలీజ్ డేట్ ప్రకటించడమే ఆలస్యం. అయితే వర్మ 22న అనుకుంటే కొంత మంది వచ్చి మార్చి నెల పది నుంచే ఎన్నికల వేడి ఉంటుందని, అందువల్ల 15న విడుదల చేస్తే రెవెన్యూ బాగుంటుందని సలహా ఇచ్చారట.

అంచనాలు అందుకుంటుందా..?

వర్మ కూడా అలోచించి ఓకే అలానే చేద్దాం అని చెప్పాడని టాక్. అందుకే వర్మ 22 కన్నా 15 న రిలీజ్ చేయాలి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు దాదాపు 10 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా వర్మ సినిమాలకి ఇంత బడ్జెట్ అవ్వదు. కానీ ఈ సినిమాకి అయింది. సినిమాపై అయితే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News