ఎన్టీఆర్ రెండో భార్యగా ఎవరంటే..!

Update: 2018-10-25 07:00 GMT

బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్.. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే క్రిష్ కూడా ఈ సినిమాలో నటించే నటుల దగ్గర నుండి వారి మేకప్ ల వరకు, అలాగే టెక్నీషియన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే నటుల కోసం బాలకృష్ణతో కలిసి మంచి ఆర్టిస్ట్ లను తీసుకుంటూ ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేపిస్తున్నారు. ఎన్టీఆర్ మొదటి భార్యగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తుంది. ఇప్పటికే బసవతారకం లుక్ లో విద్యా బాలన్ ఇరగదీసింది. ఎన్టీఆర్ జీవితంలో బసవతారకం పాత్ర చాలా ముఖ్యమైంది. కానీ బసవతారకం ఎప్పుడు బయటి ప్రజలకు కనిపించింది లేదు. అలా ఎన్టీఆర్ మొదటి భార్య తెర వెనుకే ఉండిపోయింది. ఇక ఆ పాత్రకే బాలీవుడ్ నటిని దింపిన క్రిష్, బాలయ్యలు... ఎన్నో కాంట్రవర్సీలకు మూలమైన లక్ష్మి పార్వతి పాత్రకి ఎవరిని తీసుకుంటారో అనే క్యూరియాసిటీ ఉంది.

లక్ష్మీపార్వతిగా ఆమని..

కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో వివాదాలకు తావులేకుండా తెరకెక్కిస్తున్నారనే ప్రచారంలో భాగంగా లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న విషయాలను ఆలా అలా చూపించేసి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా చేస్తారనే ప్రచారం ఉండగా.. ప్రస్తుతం లక్ష్మి పార్వతి పాత్రకి సీనియర్ హీరోయిన్ ఆమనిని సంప్రదించాడు బాలక్రిష్ణ. ఇక ఆమనికి కూడా ఆ పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. మరి ఇప్పటికే క్రిష్ తీసుకున్న పాత్ర తీరుతెన్నులు అందరిని అమితంగా ఆకర్షిస్తుండగా... ఇపుడు లక్ష్మి పార్వతి గెటప్ లో ఆమణిని చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపించేస్తున్నారు.

Similar News