కేవీపీపై క్లారిటీ ఇచ్చిన రమేష్!

Update: 2018-05-14 08:29 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి బయోపిక్ ల పిచ్చి పట్టిందనే చెప్పాలి. మొన్న 'మహానటి' సినిమా హిట్ కావడంతో వరసబెట్టి బయోపిక్స్ క్యూ కడుతున్నాయి. తేజ డైరెక్షన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ రెడీ అవుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్ నుండి తేజ తప్పుకోవడంతో దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంతవరకు క్లారిటీ లేదు.

వైఎస్ జీవిత ఆధారంగా....

మరోపక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రానికి 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'యాత్ర' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

కేవీపీ పాత్రలో......

అయితే ఈ బయోపిక్ లో కేవీపీ రామచంద్రరావు పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. ఈ పాత్రను రావు రమేష్ పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ కంఫర్మ్ చేసింది. ఇక ఇదే చిత్రంలో నాదెండ్ల భాస్కర్ రావు పాత్రను బాలీవుడ్ నటుడు సచిన్ కెడ్కర్ చేస్తున్నారని పేర్కొంది. కేవీపీ పాత్రలో రావు రమేష్ కచ్చితంగా న్యాయం చేయగలడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Similar News