కర్ర విరగలేదు.. పాము చావట్లేదు!!

కుమార్ సాయి అంటే బస్ స్టాప్ నటుడిగానే అందరికి తెలుసు. బస్ స్టాప్ సినిమాని జనాలు మర్చిపోయారు కూడా. అదే నటుడు ఇప్పుడు బిగ్ బాస్ తో [more]

Update: 2020-10-23 04:07 GMT

కుమార్ సాయి అంటే బస్ స్టాప్ నటుడిగానే అందరికి తెలుసు. బస్ స్టాప్ సినిమాని జనాలు మర్చిపోయారు కూడా. అదే నటుడు ఇప్పుడు బిగ్ బాస్ తో ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మొదట్లో ఒంటరితనంతో ఇబ్బంది పడిన తర్వాత హౌస్ మేట్స్ కి దగ్గరయ్యాడు. అలాగే వారం, వారం టాస్క్ ల పరంగా పెరఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చాడు. అయితే వెళ్ళినప్పటినుండి వారంవారం  నామినేషన్స్ కి వస్తున్న కుమార్ సాయి గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. కుమర్ సాయి ని ఎలిమినేట్ చెయ్యడంపై బిగ్ బాస్ పై తీవ్ర వ్యతిరేఖత సోషల్ మీడియాలో కనబడుతుంది. మోనాల్ అందాలు, ఆమె నడిపే లవ్ ట్రాక్ వలనే ఆమెని హౌస్ లో ఉంచి బాగా ఆడుతున్న కుమార్ ని బయటికి పంపేశారని అంటున్నారు.

ఇక కుమార్ సాయి నాగ్ తో పాటుగా బిగ్ బాస్ స్టేజ్ మీద హ్యాపీగా ఉండడమే కాదు…. అందరిని పాజిటివ్ గా అర్ధం చేసుకున్నట్లుగా మాట్లాడాడు. అయితే బయటికి వచ్చేసిన కుమార్ సాయి పలు ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ అందరిలా బిజీగానే గడుపుతున్నాడు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కుమార్ సాయి ఒక్క మాట కూడా అనడం లేదు. బిగ్ బాస్ లో తనకు బాగా స్కిట్స్ చేశా అని.. అందరూ పగలబడి నవ్వేవారని కానీ బిగ్ బాస్ ఎడిటింగ్ లో అది రాలేదని.. అయితే అది ఏ టెక్నీకల్ రీజనో, లేదంటే షో టైం సరిపోకో నా సీన్స్ కట్ చేసారు అని.. నాకు దానిపై అవగాహన లేదు అంటూ స్మూత్ గా సమాధానం చెబుతున్నాడు. అలాగే మోనాల్ – అఖిల్ కి మధ్యన ఏం ఉందొ వాళ్ళే క్లారిటీ ఇవ్వనప్పుడు నేను మాత్రం ఎలా చెబుతా అంటూ మాట్లాడి అందరిని కన్ఫ్యూషన్ లో పడేసాడు. ఏది ఏమైనా అందరిలా కాకుండా కుమార్ సాయి ఇంటర్వూస్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి.

Tags:    

Similar News