ఉప్పెన బేబమ్మ అంతలా షాకిచ్చింది

ఒకే ఒక్క సినిమా కెరీర్ నే మార్చేసినట్టుగా కృతి శెట్టి కి ఏకంగా మూడు సినిమాల ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భీభత్సమైన క్రేజ్, [more]

Update: 2021-05-26 07:29 GMT

ఒకే ఒక్క సినిమా కెరీర్ నే మార్చేసినట్టుగా కృతి శెట్టి కి ఏకంగా మూడు సినిమాల ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భీభత్సమైన క్రేజ్, ఫేమ్ సంపాదించుకున్న బేబమ్మ కృతి శెట్టి.. ఆ సినిమాతో యంగ్ హీరోల దృష్టిలో పడడమే కాదు..  నాని, సుధీర్ బాబు, రామ్ ప్రాజెక్ట్స్ కి ఇప్పటికే సైన్ చేసిన కృతి శెట్టి కి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ మూడు ప్రాజెక్ట్స్ అయ్యాకే తాను మరో సినిమా చేస్తా అని చెబుతుంది. ఉప్పెన సినిమాలో బేబమ్మగా వైష్ణవ తేజ్ తో అదిరిపోయే లవ్ ట్రాక్ నడపగా… అది ఫ్రెష్ గా ఉండడంతో ఆ పెయిర్ కి మంచి క్రేజ్ వచ్చింది.
అయితే కృతి శెట్టి ఖాళీగా ఉన్న సమయంలో ఫుల్ గా తినేసి నిద్రపోవడం అంటే ఇష్టమట. అంతేకాదు.. తన లైఫ్ లోకి రాబోయే వ్యక్తి అంటే తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అస్సలు అబద్దాలు చెప్పకూడదు. దాపరికం లేకుండా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తన జీవితంలోకి వస్తే బావుంటుంది అంటూ చెప్పి షాకిచ్చింది బేబమ్మ. షాకివ్వడం అంటే జస్ట్ 17 ఏళ్లకే ఉప్పెన సినిమాలో నటించి.. 18 ఏళ్లకే ముగ్గురు యంగ్ హీరోలతో జోడి కట్టిన కృతి శెట్టి అప్పుడే పెళ్లి పై తన అభిప్రాయాలను తెలియజెయ్యడం షాక్ కాక ఇంకేమవుతుంది. 

Tags:    

Similar News