క్రేజ్ లేని భామ ప్రభాస్ హీరొయిన్ గా?

ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏమిటో అతను చేస్తున్న సినిమాలే చెప్పేస్తున్నాయి. బాహుబలి తర్వాత ఒక్క సౌత్ సినిమా కూడా చెయ్యకుండా అన్నీ పాన్ ఇండియా మూవీస్ చెయ్యడం [more]

Update: 2020-10-17 08:37 GMT

ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏమిటో అతను చేస్తున్న సినిమాలే చెప్పేస్తున్నాయి. బాహుబలి తర్వాత ఒక్క సౌత్ సినిమా కూడా చెయ్యకుండా అన్నీ పాన్ ఇండియా మూవీస్ చెయ్యడం చూస్తే ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ లానే ఫీలవుతారు బాలీవుడ్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యాం, నాగ్ అశ్విన్ మూవీ, ఓం రనౌత్ అది పురుష్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ సరసన టాప్ హీరోయిన్స్ క్రేజీ హీరోయిన్స్ మాత్రమే నటిస్తున్నారు. రాధేశ్యాం తో పూజ హెగ్దే తో సరిపెట్టినా నాగ్ శ్విన్ సినిమాలో దీపికా తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు ప్రభాస్.

ఇక ఆదిపురుష్ హీరొయిన్ విషయమై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడైతే సీతగా కీర్తి సురేష్, అలాగే కియారా అద్వానీ ల పేర్లు మార్మోగిపోయాయి. కానీ వారిలో ఎవరిని ఆదిపురుష్ హీరొయిన్ గా ఫైనల్ చేయలేదని టీం చెప్పింది. త్వరలోనే ఆదిపురుష్ హీరొయిన్ పేరు ప్రకటిస్తారని అంటున్నారు. అయితే ఈలోపు బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేని హీరొయిన్ పేరు ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ప్రచారంలోకొచ్చింది. పెద్ద సినిమాల్లో ఆఫర్స్ లేకపోయినా.. బాలీవుడ్ ఫంక్షన్స్ లో హాట్ హాట్ గా హడావిడి చేస్తూ తెలుగులో మహేష్ తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సనన్ ఆదిపురుష్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. కానీ క్రేజ్ లేని ఆ భామ ఆదిపురుష్ హీరొయిన్ కాదు.. మరో క్రేజీ హీరొయిన్ ని ఓం రనౌత్ ఖచ్చితంగా ప్రభాస్ పక్కన సెట్ చేస్తాడని ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News