కృష్ణార్జున యుద్ధం రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు!!

Update: 2018-04-13 07:10 GMT

మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. కృష్ణ గా నాని ఊర మాస్ యాక్టింగ్ అదరగొట్టేసిందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు ముక్త కంఠంతో చెబుతున్నమాట. కానీ అర్జున్ పాత్ర మాత్రం రొటీన్ గా ఉందనే కామెంట్స్ పడ్డాయి. అనుపమ నటన, రుక్సార్ నటన కూడా బావుందని... కామెడీ ఎంటర్ టైనెర్ గా కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీతోనూ.. సెకండ్ హాఫ్ కాస్త డల్ గా ఉందనే టాక్ ఫస్ట్ షోకే స్ప్రెడ్ అయ్యింది. మరి ఏడెనిమిది హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నాని కి ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా... ప్రేక్షకులు నాని సినిమాను హిట్ చేసే అవకాశాలు బాగా వున్నాయి. ఇక కృష్ణార్జున యుద్ధం మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత కొల్లగొట్టింది అంటే..

ఏరియా షేర్స్(కోట్లలో)

నైజాం 1,90,00,000

సీడెడ్ 50,00,000

నెల్లూరు 20,00,000

కృష్ణ 28,58,240

గుంటూరు 53,00,000

వైజాగ్ 52,00,000

ఈస్ట్ గోదావరి 34,00,000

వెస్ట్ గోదావరి 29,00,000

టోటల్ ఏపీ మరియు టీఎస్ షేర్స్ కోట్లలో 4.1౭ కోట్లు.

Similar News