కృష్ణంరాజు చెప్పింది వింటే.. షాకవ్వాల్సిందే!!

ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ 22 అదేనండి ప్రభాస్ – ఓం రనౌత్ ఆదిపురుష్ సినిమా గురించి చెప్పిన ముచ్చట్లు వింటే ప్రభాస్ ఫాన్స్ కి [more]

Update: 2020-08-21 03:13 GMT

ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ 22 అదేనండి ప్రభాస్ – ఓం రనౌత్ ఆదిపురుష్ సినిమా గురించి చెప్పిన ముచ్చట్లు వింటే ప్రభాస్ ఫాన్స్ కి మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడికి దిమ్మ తిరగాల్సిందే. ప్రభాస్ ఆదిపురుష్ అంటే విష్ణు మూర్తి అవతారాల్లో ఆదిపురుష్ అవతారం ఒకటని… సోసియో ఫాంటసీ కథతో పెద్ద ఎత్తున భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చెయ్యాలని చూస్తున్నారు. ఈ ఆదిపురుష్ కథ నేను కూడా విన్నాను. చాలా బావుంది. ప్రభాస్ ఈ సబ్జెక్టు విని ఇంప్రెస్స్ అవడమే కాదు…. సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కేవలం ఐదు భాషల్లోనే కాదు.. ఈ సినిమా హాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతుంది. బాహుబలితో బాలీవుడ్ ని షేక్ చేసిన ప్రభాస్.. ఈ సినిమా ఈసారి హాలీవుడ్ ని షేక్ చెయ్యడం ఖాయమంటున్నారు ఆయన.

ఆలిండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తాం. నరేంద్ర మోడీగారు అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసారు. రాముడి కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ కథ తెరపైకి రావడం చాలా గొప్ప విషయం. మొత్తం ప్రపంచం ఆశ్చర్య పోయేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నాడు. ఇక ఆదిపురుష్ లో దశావతారాలు ఉంటాయా.. లేదా ఆదిపురుష్ అవతారం ఒకటేనా అనేది మేకర్స్ ఫస్ట్ లుక్ లోనే క్లారిటీ ఇస్తారని చెబుతున్నాడు.  నాకోరిక ఏమిటంటే ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళాలి.. అక్కడ హిట్ కొట్టాలి.  బ్లవర్లీ హిల్స్‌లో ఓ బిల్డింగ్ ప్రభాస్ కి ఉండాలి.. అక్కడ నేను ప్రభాస్ కలిసి భోజనం చెయ్యాలి ఇదే నా కోరిక. అదే విషయం ప్రభాస్ ఓ కూడా చెప్పా అంటున్నాడు కృష్ణం రాజు. మరి కృష్ణం రాజు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రబస్ ఆదిపురుష్ హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నమాట.

Tags:    

Similar News