మ‌ళ్లీ బాలీవుడ్ స్టార్ తో క్రిష్ సినిమా

ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ తరువాత క్రిష్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కారణం ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ ఫలితాలు క్రిష్ ను బాగానే ఇబ్బంది [more]

Update: 2019-05-06 10:42 GMT

ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ తరువాత క్రిష్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కారణం ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ ఫలితాలు క్రిష్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈసారి తను చేసే సినిమాలో తన మార్క్ ఉండేలా చూసుకోవాలని క్రిష్ డిసైడ్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం అతను తన నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. మరోసారి క్రిష్ బాలీవుడ్ లో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అది కూడా అక్కడ స్టార్ హీరోతో కావడం విశేషం.

వెంట‌నే ఒప్పుకున్న అక్ష‌య్‌

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోసం క్రిష్ ఓ కథ రాశారట. ఆల్రెడీ క్రిష్ అక్షయ్ ను కలిసి స్టోరీ చెప్పాడట. స్టోరీ నచ్చిన అక్షయ్ కుమార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో క్రిష్.. అక్షయ్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా చేసి భారీ విజయం సొంతం చేసుకున్నాడు. అందుకే క్రిష్ తో సినిమా అంటే అక్షయ్ వెంటనే ఒకే చేసాడని టాక్. మరి క్రిష్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూద్దాం. త్వరలోనే దీని గురించి అధికారిక‌ ప్రకటన రానుంది.

Tags:    

Similar News