మణికర్ణిక నిర్మాతపై క్రిష్ కు అంత జాలి ఏంటో..?

బాలీవుడ్ లో కంగనా లీడ్ రోల్ లో వచ్చిన ‘మణికర్ణిక’ ఏదో ఒక వివాదంలోనే ఉంటూనే ఉంది. మొదట ఈ సినిమా మొత్తం 80 శాతం వరకు [more]

Update: 2019-02-25 06:02 GMT

బాలీవుడ్ లో కంగనా లీడ్ రోల్ లో వచ్చిన ‘మణికర్ణిక’ ఏదో ఒక వివాదంలోనే ఉంటూనే ఉంది. మొదట ఈ సినిమా మొత్తం 80 శాతం వరకు క్రిష డైరెక్ట్ చేశాడు. కొన్ని కారణాలు వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చిన తరువాత డైరెక్టర్ ఛైర్ లో కంగనా కూర్చుని దాదాపు సినిమా మొత్తం మార్చేసింది. ఒక డైరెక్టర్ గా క్రిష్ కు ఇది అవమానమే. తనకు జరిగిన అన్యాయం గురించి అడిగితే ప్రతిగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరేలే ఎందుకని సలైంట్ గా కూర్చున్నాడు. ఇవి చాలవు అన్నట్లు సినిమా రెమ్యూనరేషన్‌లో కూడా చాలా కోత పడింది. ముందు అనుకున్న దాంట్లో క్రిష్ కు 30 శాతం వరకే ఇచ్చారట. అదేంటి మీరు కష్టపడి తీసిన సినిమాకు తగిన పారితోషకం తీసుకోకుండా ఎందుకు ఉన్నారు అని అడిగితే క్రిష్ చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చాడు.

ఆరోగ్యం బాగోలేనందున

మణికర్ణిక సినిమా నిర్మాతకు గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని.. అందుకే పారితోషకం విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకోలేదని క్రిష్ చెప్పాడు. ఈ టాపిక్ మీద నేను కాంట్రావర్సీ చేయాలి అనుకోలేదని చెప్పాడు. తనకు ఈ ఒక్క సినిమా మీద వచ్చే ఆదాయంతో బతకాలని లేదని.. డబ్బుల కోసం వెంపర్లాడే రకం తాను కాదని అన్నాడు. కానీ నిర్మాత కమల్ జైన్ మణికర్ణిక రిలీజ్ టైంలో క్రిష్ తనకు జరిగినా అన్యాయం గురించి గళం విప్పితే అతడి మీదే విమర్శలు గుప్పించాడు. అటువంటి నిర్మాత పై క్రిష్ అంత జాలి దేనికో?

Tags:    

Similar News