‘మణికర్ణిక’పై నోరు విప్పిన క్రిష్

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ బాలీవుడ్ కి వెళ్లి కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక [more]

Update: 2019-01-14 08:00 GMT

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ బాలీవుడ్ కి వెళ్లి కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక సినిమాని వారణాసి సాక్షిగా మొదలు పెట్టి… గత ఏడాది ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాడు. క్రిష్ టేకింగ్ వేగం అందరికీ తెలిసిందే. కానీ ఏప్రిల్ నుండి మణికర్ణిక సినిమా ఆగష్టు 15 కి వాయిదా పడింది. క్రిష్ మణికర్ణిక సినిమాని 109 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాడు. అయితే గత ఏడాది క్రిష్ కి, కంగానాకు ఏదో గొడవ జరగడంతో క్రిష్ మళ్ళీ మణికర్ణిక వైపు చూడకుండా తనకు అవకాశమొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కథనకాయకుడు షూటింగ్ లో బిజీ అయ్యాడు.

షూటింగ్ మొత్తం పూర్తిచేశా…

అప్పటి నుండి ఇప్పటివరకు మణికర్ణిక విషయమై నోరుమెదపని క్రిష్… కథానాయకుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తూ మీడియా ఇంటర్వూస్ లో బిజీగా ఉన్న టైంలో తాను మణికర్ణిక నుండి బయటికి రావడం.. కంగనాతో తన గొడవ విషయమై స్పందించాడు. మణికర్ణిక షూటింగ్ 109 రోజుల్లోనే షూట్‌ చేశాం. అయితే కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. ఈలోపు ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో పాటుగా… మరో పదిహేను రోజుల్లో మిగిలిన ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేద్దాం అనుకుని ఎన్టీఆర్‌ కోసం వచ్చెయ్యడంతో మణికర్ణిక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే సినిమా చేతులు మారిందో.. రకరకాల మార్పులు మొదలయ్యాయి.

క్రెడిట్ గురించి పట్టించుకోను

ఆలోపే మాణికర్ణికలో కీలక నటుడు సోనూసూద్‌ని హఠాత్తుగా తొలగించి… అప్పటి వరకూ సోనూసూద్ పై తెరకెక్కించిన సన్నివేశాలు మరో నటుడితో రీషూట్‌ చెయ్యడమే కాదు… కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారు. కానీ మణికర్ణిక గురించి నేను చెడుగా మాట్లాడతే మణికర్ణిక శోభ తగ్గుతుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉండాలనుకుని మౌనంగా ఉన్నా. ఇక సోనూసూద్ తప్పేమి లేకపోయినా ఆయన్ని సినిమా నుండి తొలిగించడం తప్పని అభిప్రాయపడ్డాడు క్రిష్. ఇక మణికర్ణిక డైరెక్షన్ క్రెడిట్ నాకొస్తుందా.. లేక కంగానికి వెళుతుందా అనేదాని గురించి అసలు ఆలోచించనని క్రిష్ తెలియజేశాడు.

Tags:    

Similar News