బాలయ్య మరీ ఇంత సాఫ్ట్ టైటిల్ తోనా?

బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10. అది నిన్ననే అయ్యిపోయింది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. కారణం బాలకృష్ణ తన సినిమాని అధికారికంగా నిన్న [more]

Update: 2019-06-11 06:26 GMT

బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10. అది నిన్ననే అయ్యిపోయింది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. కారణం బాలకృష్ణ తన సినిమాని అధికారికంగా నిన్న సాయంత్రం వరకు ప్రకటించలేదు. బోయపాటి తో బాలకృష్ణ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని ఆశపడిన బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. అయితే బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ సినిమా రేపో మాపో పట్టాలెక్కుతోంది అనుకున్నప్పుడు.. ఆ సినిమా ఆగిపోయిందన్నారు. కానీ బాలయ్య పుట్టిన రోజు నాడు సాయంత్రానికి బాలయ్య – కె ఎస్ రవికుమార్ ల సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది. సి కళ్యాణ్ – బాలయ్య కొత్త సినిమా కె ఎస్ రవికుమార్ దర్శకుడిగా మొదలు కాబోతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో మొదటి నుండి చెప్పుకున్నట్టుగా జగపతి బాబు విలన్ గా డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడట. ఇక బాలకృష్ణ ఎప్పుడు మాస్ అండ్ పవర్ ఫుల్ టైటిల్ తోనే బరిలోకి దిగుతాడు. అందులో నరసింహనాయుడు, సమర సింహారెడ్డి, లెజెండ్, సింహ, జై సింహ లాంటి పవర్ ఫుల్ టైటిల్ నే బాలయ్య వాడేవాడు. కానీ తాజాగా కె ఎస్ రవికుమార్ – బాలయ్య చిత్రానికి ఓ సాఫ్ట్ టైటిల్ తెరమీదకి వచ్చింది. అదే క్రాంతి అనే టైటిల్. బాలకృష్ణ పేరునే టైటిల్ గా ఉండబోతుందని ఫిలింనగర్ టాక్. మరి క్రాంతిగా బాలయ్య తన నట విశ్వరూపాన్ని ఎలా చూపించబితున్నాడో కానీ.. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం సాఫ్ట్ టైటిల్ బాలయ్యకి అచ్చిరాదని తెగ ఫీల వుంటున్నారు.

Tags:    

Similar News