కొరటాల.. చిరుతో ఖాయమా..?

Update: 2018-05-23 06:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనంతట తానుగా ఎవరినీ సంప్రదించడు. ఏ డైరెక్టరైనా తన దగ్గరకు వస్తే తప్ప. కానీ త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆలా కాదు. త్రివిక్రమ్ నే పిలిచి తనతో సినిమా చేయమని పవన్ అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టడంతో అతను ఓ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ అయ్యాడని సమాచారం. వరుసగా నాలుగు పెద్ద హిట్స్ ఇచ్చిన కొరటాల తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నాడు.

పవన్ పోయి చిరు వచ్చే...

అయితే అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ ఫర్మ్ అని ఫిలింనగర్ టాక్. యంగ్ హీరోలని వదిలేసి సీనియర్ హీరో చిరంజీవి దగ్గరకి కొరటాల వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. కానీ నిజానికి కొరటాలకు.. పవన్ తో సినిమా చేయాలనే ఆలోచన ఉందట. అయితే పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో చిరంజీవికి అనుగుణంగా ఆ స్క్రిప్ట్ ని మారుస్తున్నాడట.

వారు నోరువిప్పితేనే...

చిరంజీవికి కూడా పవన్, మహేష్ లా మంచి మార్కెటే ఉంది. చిరుతో అయితే కచ్చితంగా బిజినెస్ అవుతుందని భావించి వేరే యువ హీరోలని కాకుండా చిరంజీవితో సినిమా కమిట్‌ అయ్యాడని తెలిసింది. అయితే ఈ చిత్రంపై క్లారిటీ రావాలంటే ఎవరోఒకరు నోరు విప్పాల్సిందే.

Similar News