కొరటాలకు నిజంగా అలా కలిసొచ్చింది అంతే!!

Update: 2018-05-03 11:00 GMT

కొరటాల శివ ఒక రైటర్ గా సినిమా కెరీర్ ని ప్రారంభించాడు. కానీ రైటర్ కన్నా శివ కి మొదటినుండి దర్శకత్వం మీదే ఎక్కువగా గురి ఉండేది. అందుకే ప్రభాస్ కి తన వద్ద ఉన్న మిర్చి కథ చెప్పగా.. వెంటనే ప్రభాస్ కూడా కథ నచ్చి కొత్త దర్శకుడు అని చూడకుండా అవకాశం ఇవ్వడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం జరిగింది. ఆ సినిమాలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా... కథ కూడా కొత్తగా ఉన్నప్పటికీ కొరటాల మార్క్ మేకింగ్ ఆ సినిమా బిగ్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు తో శ్రీమంతుడు అంటూ ఒక ఊరిని దత్తత తీసుకుని.. ఆ ఊరి కోసమా కష్టపడే యువకుని కథతో మెప్పించాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

దీనికి యావరేజ్ టాక్...

అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన జనతా గ్యారేజ్ కి మాత్రం కొరటాలకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా మొదట్లో పాజిటివ్ టాక్ రాకుండా... యావరేజ్ టాక్ రావడంతో సినిమా పోయింది అనుకున్న టైములో.. సినిమాకి మంచి కలెక్షన్స్ రావడంతో ఎన్టీఆర్ - కొరటాల ఇద్దరు కలిసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు తో మళ్ళీ భరత్ అనే నేను సినిమాని తీసిన కొరటాల... ఆ సినిమా లో అనుకున్నంత కామెడీ లేకపోవడం, అలాగే కావాల్సినంత రొమాన్స్ లేకయినా.. కూడా సినిమా హిట్ అయ్యింది.

అంతా లక్కేనా?

అసలు మహేష్ బాబు భరత్ అనే నేను లో ఆసాంతం సీరియస్ నెస్ తో ఉండడం... అలాగే సినిమాలో ఎక్కువగా ట్విస్ట్ లు లేకపోవడం తో.. బిసి సెంటర్స్ ప్రేక్షకులకు ఈ సినిమా దగ్గర రీచ్ కాలేదనే అభిప్రాయాలూ ఉన్నప్పటికీ భరత్ అనే నేను సినిమా కలెక్షన్స్ మోత మోగిస్తున్నాయి. రంగస్థలం సినిమా తో పోటాపోటీగా మహేష్ భరత్ అనే నేను సినిమా కలెక్షన్స్ వస్తున్నాయంటే నిజంగా ఇది కొరటాల శివ కు తగిలిన లక్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కని భరత్ కలెక్షన్స్ మాత్రం ఇరగదీస్తున్నాయి. మరి నిజంగా కొరటాల శివ కి జనతా గ్యారేజ్, భరత్ అనే నెను సినిమాలు రెండు లక్కుగా హిట్ అయ్యాయనే చెప్పాలి. ఇక భరత్ కలెక్షన్స్ కి అల్లు అర్జున్ నా పేరు సూర్య తో రేపు శుక్రవారం నుండి స్టాప్ పెట్టెయ్యబోతున్నాడు.

Similar News