ప్రొడ్యూసర్ గా మారనున్న స్టార్ డైరెక్టర్

Update: 2018-12-19 03:06 GMT

చాలా తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ కొరటాల శివ. చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడంతో తనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోస్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శివ చిరంజీవి తో ఓ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఇంకా అధికారంగా ప్రకటించకపోయినా సినిమాకు సంబంధించి వర్క్ కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈనేపధ్యంలో కొరటాల ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

వార్తలు రావడమే కాదు దానికి సంబంధించి ఆల్రెడీ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. కానీ తను డైరెక్ట్ చేసే సినిమాలు తన సొంత బ్యానర్ లో ప్రొడ్యూస్ చేయడట. కొత్త డైరెక్టర్స్ ని..కొత్త కాన్సెప్ట్స్ ను ఎంకరేజ్ చేయాలనీ ఆయన ప్రయత్నం అంట. తన మిత్రుడు అయినా సుధాకర్ తో కలిసి నిర్మాణ రంగంలోకి రానున్నారు. అయితే ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని మాత్రం క్లారిటీ లేదు. తనకున్న బ్రాండ్ మీద బిజినెస్ జరుగుతుందని..ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నాడు.

రీసెంట్ గా సుకుమార్..క్రిష్ ప్రొడక్షన్ హౌస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ క్యాటగిరీలోకి కొరటాల చేరాడు. అలాగే తాను చాలా కథలు నచ్చినా సమయం సరిపోని కారణంగా ఆ చిత్రాలను తాను డైరెక్ట్ చేయలేకపోతున్నానని..అందుకే యంగ్ డైరెక్టర్స్ కు ఆ అవకాశం ఇద్దామని భావిస్తున్నాడు. త్వరలోనే దీని గురించి అధికారంగా తెలియనుంది. మరి బ్యానర్ నేమ్ ఏమి పెడతారని ప్రేక్షకుల్లో ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Similar News