కొరటాల పూర్తిగా మారిపోతున్నారు ...?

Update: 2018-05-05 01:55 GMT

కొరటాల శివ. ఆయన పేరు వినగానే చక్కటి సందేశాత్మక చిత్రాలు కళ్ళముందు కనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్ తో కూడిన సామాజిక సందేశాన్ని మిక్స్ చేసి హిట్ కొట్టే దమ్మున్న దర్శకుడు శివ. ఆయన తీసిన మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, తాజాగా భరత్ అనే నేను అన్ని హిట్స్ గా నిలిచి రికార్డులు సృష్టించాయి. కొరటాల సినిమా అనగానే అదెలా ఉంటుందో కూడా ప్రేక్షకులు అంచనా వేసే స్థాయికి ఆయన ఫార్ములా లీక్ అవుతుంది. ఇదెప్పుడో ఒకప్పుడు తనను దెబ్బ తీస్తుందని తద్వారా ఒక మూస డైరెక్టర్ గా అప్రదిష్టపాలు అవుతానని భావించాడు కొరటాల.. అది గ్రేహించి సరికొత్త శివను ప్రేక్షకులముందుకు తేనున్నాడు.

ప్రేమ కధలో పడ్డ కొరటాల ...

హిట్ దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కొరటాల తన పాత ట్రెండ్ ను పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాడు. కొత్త ట్రెండ్ లో భాగంగా ఎలాంటి సందేశాత్మ చిత్రాల జోలికి పోకుండా లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. అది అక్కినేని అఖిల్ తో. ఈ చిత్రంకోసం ఒక మంచి లవ్ స్టోరీ కి నగిషీ పెడుతున్నారు ఆట, రొటీన్ కి భిన్నంగా ఆలోచించే కొరటాల శివ ఈ స్టోరీ రాయడానికి ఇప్పుడు అహరహం శ్రమిస్తున్నారు. గత ట్రెండ్స్ కి విరుద్ధంగా తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మరి శివ లాంటి డైరెక్టర్ కి ఇది కొంత రిస్క్ ఉంటుంది. మరి శివ ఎలాంటి అడుగులు వేసి విజయతీరాలను తాకుతారో చూడాలి.

Similar News