వీడియో సందేశాన్ని మీడియాకి పంపాడు

Update: 2018-04-18 04:16 GMT

భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న భరత్ అనే నేను మీద అందరిలో అమితాసక్తి ఉంది. మహేష్ బాబు - కొరటాల క్రేజీ కాంబో రిపీట్ అవవడంతో సినిమాపై ఎనలేని అంచనాలున్నాయి. అయితే సినిమా చాలా బాగా వచ్చిందని.... చిత్ర బృందంతోపాటు కొరటాల శివ, మహేష్ కూడా పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నారట. అయినా ఎక్కడో చిన్న టెన్షన్. టాక్ యావరేజ్ వచ్చినా పర్లేదు గాని.. టాక్ లో తేడా వస్తే అంతే సంగతులు. కానీ భరత్ సినిమా బంపర్ హిట్ కొడుతుందని అందరు ఫిక్స్ అవడమే కాదు మహేష్ అయితే భరత్ యూనిట్ కి ఐ ఫోన్ 10 లిచ్చేశాడు. ఇక ప్రస్తుతం విదేశాల నుండి హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు భరత్ ఇంటర్వ్యూ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ భరత్ గురించి భారీగా చెప్పుకుపోతున్నాడు.

అయితే ఎప్పుడూ సౌమ్యుడిగా తన పని తాను చేసుకుపోయే కొరటాల మీద ఈ మధ్యన శ్రీరెడ్డి చేసిన క్యాష్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కొరటాల పేరు బయట పెట్టకుండా టాప్ దర్శకుడు, సామజిక సమస్యలపై పోరాటం చేస్తూ మెస్సేజ్ ఒరింటెడ్ మూవీస్ తీసే దర్శకుడు అంటూ.. కొరటాల పేరు అర్ధం వచ్చేలా శ్రీ రెడ్డి వాట్స్ అప్ చాటింగ్ లిస్ట్ లీక్ చేసింది. అయితే ఎప్పటినుండో మౌనం వహించినకొరటాల ఇప్పుడు భరత్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించాడు. శ్రీరెడ్డి పేరెత్తకుండా నా లైఫ్ లో నా తల్లి, నా భార్యకి తప్ప మారె స్త్రీ కి చోటు లేదని చెప్పిన.. కొరటాల తనకి ఈ విషయంలో తన భార్య బాసటగా నిలిచిందని ఒక వీడియో సందేశాన్ని మీడియాకి పంపాడు.

అయితే ప్రస్తుతం విడుదలకు సిద్దమైన భరత్ సినిమా మీద ఈ కొరటాల - శ్రీ రెడ్డి ల ఇష్యు ఎఫెక్ట్ ఎమన్నా పడుతుందేమో అనే ఆందోళనలో మహేష్ ఫాన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. భరత్ టాక్ ఒకవేళ బాగోపోయిందా కొరటాల.. శ్రీ రెడ్డిల వ్యవహారం మళ్ళీ బయటికి తీస్తుంది మీడియా. శ్రీ రెడ్డి ఇష్యుతో కొరటాల ను ముడిపెట్టి మరిన్ని వార్తలను సృష్టించిపడేస్తారు. చూద్దాం కొరటాల ఈ విషయాన్నీ ఇంకెలా హ్యాండిల్ చేస్తాడో... అనేది.

Similar News